Prakash Raj: “మా” ఎలక్షన్ ప్రచారంలో దూసుకుపోతున్న ప్రకాష్ రాజ్..!!

Share

Prakash Raj: టాలీవుడ్ ఇండస్ట్రీలో మా అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న ప్రకాష్ రాజ్.. “మా” అధ్యక్ష పదవికి తన ప్యానల్ నుండి పోటీ చేస్తున్న వారికి ఇటీవల విందు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రాజ్… మా ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత తన మేనిఫెస్టో రెడీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి తో కలుపుకొని పోతున్నట్లు.., అందరిని శాటిస్ఫ్యాక్షన్ చేసే పరిస్థితి ఎక్కడా ఉండదని తన పని ప్రచారం చేసుకుంటూ పోవటమే అని పేర్కొన్నారు.

prakashraj hashtag on Twitter

ఈ క్రమంలో ఇండస్ట్రీకి సంబంధించి అనేక రకాల ఆర్టిస్టులను కలుస్తున్నట్లు వారితో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంటున్నట్లూ కూడా క్లారిటీ ఇచ్చారు. కచ్చితంగా అందరితో పని చేసే విధంగా తన నాయకత్వం ఉంటుందని మీడియా ముఖంగా తెలిపారు. మ్యానిఫెస్టో విషయంలో మా సభ్యులతో చర్చించి.. ప్రకటిస్తాం అని పేర్కొన్నారు. సరిగ్గా ఎలక్షన్లకు 21 రోజుల ముందు మేనిఫెస్టో ప్రకటించాలని ఆ దిశగానే మా క్రమశిక్షణ సంఘం వ్యవహరిస్తుందని తెలిపారు.

 

గతంలో మాదిరిగా కాకుండా ఈసారి అందరితో పని చేసుకునే దిశగా.. కలుపుకుంటూ పోతున్నట్లు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మహా అధ్యక్ష ఎన్నికలలో తాను గెలిస్తే దారిద్ర్య రేఖ దిగువన ఉన్న 100 మంది కళాకారులకు.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చేలా చేస్తానని బండ్లగణేష్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా త్వరలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో జరగబోయే మా అధ్యక్ష ఎన్నికలు .. తెలుగు రాజకీయ వాతావరణాన్ని తలపిస్తున్నాయి అని పరిశీలకులు అంటున్నారు.


Share

Related posts

గుణశేఖర్ శాకుంతలం లో దుష్యంతుడు గా సరైన హీరో దొరికాడు ..?

GRK

భారతీయుడు 2 ని ఆపేసిన శంకర్ ..?

GRK

బిగ్ బాస్ 4 : అభిజిత్ తో చివాట్లు…. అఖిల్ దగ్గర ముద్దులు..! మోనాల్ కథ సూపర్

arun kanna