ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కల్యాణ్ .మధ్యలో నాగబాబు! టాలీవుడ్ పై గ్రేటర్ ఎన్నికల ఎఫెక్ట్ !

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో టాలీవుడ్ లో ఒక వివాదానికి తెరలేచింది. జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద సీనియర్ మోస్ట్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

వెంటనే పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు రంగంలోకి దిగేసి ప్రకాష్ రాజ్ కు కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ నుండి తప్పుకొని బీజేపీకి సపోర్ట్ చేయడాన్ని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తప్పుబట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ స్థిరత్వమే లేకుండా.. ఊసరవెల్లిలా ప్రవర్తిస్తున్నారంటూ ప్రకాశ్ రాజ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో జనసేన పోటీవిషయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. పవన్ కోరారు.పవన్ 2019 ఏపీ ఎన్నికల్లో బీజేపీని తిట్టిపోశారని.. మళ్లీ ఇప్పుడు అదే పార్టీకి మద్ధతు ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు.

ఇది ఊసరవెల్లి రాజకీయమని ఆయన వ్యాఖ్యానించారు ‘ఆయనకు ఏమైందో నాకు అస్సలు అర్థం కావడం లేదు.పవన్ కల్యాణే ఒక పార్టీ అధినేత!ఆయన తన పార్టీని బలోపేతం చేసుకోవాల్సింది బదులు మరో పార్టీకి తోకలా మారడం ఏమిటని ప్రకాష్రాజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.జనసేన బీజేపీల కూటమిని తిప్పి కొట్టి టిఆర్ఎస్ కి ఓటేసి గెలిపించాలని ప్రకాష్ రాజ్ గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లకు పిలుపునివ్వటం కొసమెరుపు.ఎప్పుడైతే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయో ఆయన సోదరుడు నాగబాబు బరిలోకి దిగారు.ఎవడికి కళ్యాణ్ ద్రోహం చేశాడని ప్రతి పనికిమాలినవాడు విమర్శిస్తున్నాడని నాగబాబు కౌంటర్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్‌ని ఊసరవెల్లితో పోల్చిన ప్రకాశ్ రాజ్‌ను.. మనిషిగా మారాలని నాగబాబు కోరారు. రాజకీయాల్లో నిర్ణయాలు అనేకసార్లు మారుతుంటాయి. బట్ ఆ నిర్ణయాల వెనుక ఉద్దేశ్యం లాంగ్ టర్మ్‌లో పార్టీకి, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు అయితే చాలా మంచిది.

మా నాయకుడు పవన్ కళ్యాణ్ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చి బీజేపీ గెలుపుకు కృషిచేయడం వెనుక విస్తృత ప్రజాప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు ఉన్నాయని నా నమ్మకం అని నాగబాబు పేర్కొన్నారు. ఈ దేశానికి బీజేపీ లాంటి పార్టీతో, ఏపీకి జనసేన పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నాగబాబు ఉద్ఘాటించారు.పనిలో పనిగా ప్రకాష్ మీద నాగబాబు వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు.నిర్మాతలని ఎన్ని రకాలుగా డబ్బుకోసం హింస పెట్టావో, ఇచ్చిన డేట్ప్‌ని క్యాన్సల్ చేసి ఎంత హింసకి గురిచేశావో ఇంకా గుర్తున్నాయి ప్రకాశ్ రాజ్. ముందు నువ్వు మంచి మనిషిగా తయారయ్యి అప్పడు పవన్ కళ్యాణ్ అనే ఒక మంచి మనిషి, నిస్వార్థ పరుడైన నాయకుడిని విమర్శించు అని నాగబాబు సలహా ఇచ్చారు.తన సోదరుల మీద నాగబాబు ఈగవాలనివ్వడు.ఒక సందర్భంలో నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయనెవరో తనకు తెలీదన్నట్లుగా కామెంట్లు చెయ్యగా నాగబాబు బాలయ్యను ఆడుకున్నాడు.ఇప్పుడు పవన్ కల్యాణ్ జోలికి ప్రకాష్రాజ్ వచ్చేసరికి మరోసారి నాగబాబు తన విమర్శల కత్తికి పదును పెట్టాడు ఈ వివాదం మరింత ముదిరే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.