NTR: చంద్రబాబు కన్నీటి పై ఎన్టీఆర్ స్పందించిన దానిపై ప్రకాష్ రాజ్ వైరల్ కామెంట్స్..!!

Share

NTR: ఏపీ అసెంబ్లీలో(Ap Assembly) తన భార్యపై వైసీపీ(YCP) నాయకులు ఇష్టానుసారంగా కామెంట్లు చేసినట్లు నిన్నమీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర ఏర్పాటు చంద్రబాబు(Chandrababu) ఏడవటం ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. చంద్రబాబు ఏడవటం పట్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రాజకీయాలలో వ్యక్తిగత దూషణలకు వెళ్లకూడదని మరీ ముఖ్యంగా.. ఇంట్లో ఉన్న మహిళలనీ… రాజకీయాల్లోకి తీసుకు రాకూడదు అని.. ఏ పార్టీ వారైనా సరే.. హుందాతనం రాజకీయాలు చేయాలని కామెంట్లు చేస్తూ ఉన్నారు. పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు ఏడవటం పట్ల నందమూరి కుటుంబ సభ్యులు.. ఏపీ ప్రభుత్వం పై ఘాటుగా రియాక్ట్ అవ్వడం జరిగింది.

Jr NTR Warns Politicians | Ysrcp Vs TDP | Chandrababu Naidu || Oneindia Telugu - video Dailymotion

నందమూరి బాలయ్య బాబు(Balakrishna) ఖబడ్దార్ అంటూ … అరాచక పాలన అంటూ.. మరోసారి రిపీట్ అయితే ఊరుకునే ప్రసక్తి లేదు అంటూ.. హెచ్చరించడం జరిగింది. ఇదే సమయంలో ఎన్టీఆర్(NTR) కూడా స్పందించి.. ఆడ వాళ్లను రాజకీయాల్లోకి తీసుకు రాకూడదు అని.. మనిషికి మాటే ముఖ్యమని, సరిగ్గా మాట్లాడాలని ఉందా తనం రాజకీయం చేయాలని.. ఇంట్లో ఆడవాళ్ళ ను టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తే అది అరాచక పాలన అవుతుందని.. నిన్న ఒక వ్యక్తికి జరిగిన సందర్భం బట్టి కాకుండా దేశ పౌరుడిగా ఒక భర్తగా కొడుకుగా.. ఆవేదన చెంది.. మాట్లాడుతున్నట్లు ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వడం జరిగింది. విమర్శలు ప్రతివిమర్శలు ప్రజా సమస్యలపై జరగాలి కానీ.. వ్యక్తిగత దూషణలకు వెళ్ళకూడదని తెలియజేశారు.

Viral Video: Chandrababu Naidu Breaks Down In Press Conference

ఆడ వాళ్లను గౌరవించడం అనేది మన సంస్కృతి

అసెంబ్లీలో జరిగిన ఘటన మనసుకి బాధ అనిపించింది అని ముఖ్యంగా ప్రజా సమస్యలను పక్కనబెట్టి ఆడపడుచులను టార్గెట్ చేసి పరుష పదజాలం వాడుతున్నామో.. అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతోంది అని స్పష్టం చేశారు. ఆడ వాళ్లను గౌరవించడం అనేది మన సంస్కృతి. మన రక్తంలో ఇమిడిపోయిన టువంటి సాంప్రదాయం. మన సంప్రదాయాలను రాబోయే తరానికి జాగ్రత్తగా అప్పుజేప్పాలి. ఈ మాటలు ఒక వ్యక్తిగత దోషములకు గురైన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుడిగా… రియాక్ట్ కావడం లేదు. ఒక కొడుకుగా భర్తగా తండ్రిగా దేశ పౌరుడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులకు విన్నపం దయచేసి ఇటువంటి అరాచక సంస్కృతి ఇక్కడితో ఆపేయండి. రాబోయే తరానికి బంగారు బాట వేసే లాగా అటువంటి నడవడిక ఉండేలాగా వ్యవహరించండి అంటూ ఎన్టీఆర్ అలా స్పందించడాన్ని.. ట్విటర్ వీడియోలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ‘వెల్ సెడ్ డియర్’ అంటూ తారక్ ట్విటర్ వీడియోను రీట్వీట్ చేసి క్యాప్షన్ పెట్టారు.

 


Share

Related posts

హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రధాని

Siva Prasad

యశ్ బ్యాక్ పై కొడితే…. మోనాల్ మాత్రం వెళ్ళి కౌగిలించుకుంది..!

arun kanna

Liquor door delivery: చత్తీస్‌ఘడ్ ఆలోచన ఇతర రాష్ట్రాలకు ఆదర్శమేగా..? మందు బాబులకు గుడ్ న్యూస్ అందిస్తాయా..!?

somaraju sharma