Pranavi Manukonda : ప్రణవి మనుకొండ Pranavi Manukonda గురించి తెలుసు కదా. తను ఒక సోషల్ మీడియా స్టార్. టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ లలో తనకు మిలియన్ల ఫాలోయర్స్ ఉన్నారు. ప్రణవి ప్రస్తుతం టీవీ సీరియళ్లలోనూ నటిస్తోంది. సినిమాల్లోనూ అడపా దడపా నటిస్తున్న ప్రణవి.. సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా ఫేమస్ అయింది.

ప్రణవి మనుకొండ సోషల్ మీడియాలో ఒక్క వీడియో పెడితే చాలు.. రచ్చ రంబోలానే. ఆ వీడియో కానీ.. ఫోటో కానీ.. సోషల్ మీడియాలో ఫుల్ టు వైరల్ అవ్వాల్సిందే. అది ప్రణవి పాపులారిటీ.
Pranavi Manukonda : క్యాష్ ప్రోగ్రామ్ లో సుమక్కను ఓ ఆట ఆడుకున్న ప్రణవి
అయితే.. ప్రణవి.. తాజాగా క్యాష్ ప్రోగ్రామ్ కు గెస్ట్ గా వచ్చింది. తనొక్కతే కాదు.. తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్ల చిన్నప్పటి క్యారెక్టర్లు చేసే అన్నె, నిఖిల్, సాత్విక్ కూడా ఈ షోకు గెస్టులుగా వచ్చారు.
వీళ్లంతా కలిసి చేసిన హడావుడి మాత్రం మామూలుగా లేదు. ఏకంగా సుమక్కనే వీళ్లు ఓ ఆట ఆడేసుకున్నారు. మామూలుగా సుమ వేరే వాళ్లతో ఆడుకుంటే.. చిన్న పిల్లలే కదా.. సుమ లైట్ తీసుకుంటే.. వీళ్లు మాత్రం సుమక్కను ఓ ఆట ఆడేసుకున్నారు. ఆమె ఏం మాట్లాడినా సెటైర్లు వేశారు. ప్రణవి కూడా అంతే. మొత్తం మీద వీళ్లంతా చేసిన హడావుడి మామూలుగా లేదు.
క్యాష్ లేటెస్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా దానిపై ఓ లుక్కేసుకోండి.