Pranitha: బొంగరాల్లాంటి కళ్ళతో, తన అంద చందాలతో యువతను ఆకట్టుకుంది కన్నడ బ్యూటీ ప్రణిత Pranitha. ఈమె సినీ ఇండస్ట్రీ కి వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈమెకు సరైన హిట్ రాలేదు. పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది సినిమాలో నటించినప్పుడు ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈమెకు ఇక నుంచి తిరుగు ఉండదు అనుకున్నారు ప్రేక్షకులు. కానీ అంతటి బ్లాక్ బష్టర్ సినిమా తరువాత కూడ ఆమె కెరియర్ ఏ మాత్రం పుంజుకోలేదు.
సాధారణంగా దక్షిణాది హీరోయిన్ లకి ఎంతో క్రేజ్ ఉంటే తప్ప బాలీవుడ్ లో ఒక ఛాన్స్ దొరకదు. కానీ ఈ కన్నడ బ్యూటీ విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగానే జరుగుతోంది. ఇటీవల ప్రణీతకు అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఆఫర్ వచ్చింది. ఈ సినిమాను డైరెక్టర్ అభిషేక్ తెరకెక్కించనున్నారు. అయితే, అభిషేక్ ఈ సినిమాకి గాను ప్రణీతకి ఒక కండిషన్ పెట్టారట. అదేమిటంటే ఈ సినిమా లో ప్రణిత బాగా బొద్దుగా కనిపించాలని. ఇక ప్రణిత అందుకు ఒప్పుకుని ప్రస్తుతం బరువుపెరిగే పనిలో ఉందట.
గతంలో టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి ‘సైజ్ జీరో’ సినిమా కోసం ఇటువంటి ప్రయోగమే చేసి ఇప్పటికి బరువు తగ్గించుకోలేకపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే అనుష్క యోగా, డైట్, వర్కౌట్స్ తో కూడా తన బరువుని తగ్గించుకోలేకపోతుంది. తన బరువుని తగ్గించుకోవడానికి స్వీటీ చాలా కష్టపడినట్లు ఇండస్ట్రీ లో టాక్ నడిచింది. ఇప్పుడు ప్రణీత కూడా అదే తరహా రిస్క్ తీసుకుంటుంది. మరి ఇదే పరిస్థితి ప్రణితకు ఏర్పడితే అప్పుడు ఈమె కెరీర్ ఏంటో అంటూ ఇండస్ట్రీ వర్గాలలో చర్చ నడుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?