Subscribe for notification

కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ తో రికార్డ్స్ అన్ని బద్దలు .. ఇక పదేళ్ళపాటు ప్రశాంత్ నీల్ గురించే మాట్లాడుకుంటారు ..!

Share

కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ రిలీజై కనీసం 24 గంటలు కూడా గడవకముందే గత రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టింది. దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న kgf chapter-2 సినిమా విషయంలో ఖచ్చితంగా కొత్త రికార్డులు సృష్టిస్తుందని అనుకున్నారు. అది కూడా సినిమా రిలీజైయ్యాక. కాని kgf chapter-2 విడుదలకు ముందే రికార్డులు బద్దలు కొడుతోంది. శుక్రవారం హీరో యశ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ ప్రపంచ రికార్డు సృష్టించింది. విడుదలైన గంటల్లోనే కోట్లాది వ్యూస్ రాబట్టి కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.

ప్రశాంత్ నీల్ – యష్ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన kgf chapter-2 అనుకున్న సమయానికంటే ముందే టీజర్ రిలీజ్ అయింది. ముందు నుంచి టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ప్రేక్షకులు మొదటి రెండు గంటలల్లోపే 10 మిలియన్స్ వ్యూస్ తో ట్రెండ్ సెట్ చేశారు. ఇలాంటి రికార్డ్ ఇంతక ముందు ఏ సినిమా విషయంలో జరగకపోవడం ఇండస్ట్రీ వర్గాలలో ఆశ్చర్యానికి లోనయ్యేలా చేస్తోంది. ఇక kgf chapter-2 టీజర్ రిలీజైన కేవలం 12 గంటల్లోనే వివిధ భాషల్లో కలిపి 25 మిలియన్ల (2.5 కోట్లు) మంది చూడటం తో ఈ వ్యూయర్ షిప్ చూసి ప్రపంచ రికార్డు సృష్టించి విశ్లేషకులు షాకవుతున్నారు.

ఇక ఈ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకే యూట్యూబ్లో ‘ kgf chapter-2’ టీజర్ అన్ని భాషల్లో కలిపి 3 కోట్లకు పైగా వ్యూస్ సాధించడం గొప్ప విశేషం. ఈ టీజర్ లైక్స్ విషయంలోనూ ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తోంది. అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ 2 మిలియన్ లైక్స్ సంపాదించిన టీజర్ గా వరల్డ్ రికార్డులు నెలకొల్పింది kgf chapter-2 టీజర్. దీంతో ఇప్పుడు సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో అని అభిమానులు .. విశ్లేషకులు చెప్పుకుంటున్నారట. ఇక ‘కేజీఎఫ్-2’ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా .. సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్, రవీనాంటాండన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.


Share
GRK

Recent Posts

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

4 mins ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

34 mins ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

34 mins ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

1 hour ago

Non Veg: వర్షాకాలం ఆకుకూరలతో పాటు మాంసాహారం తినకూడదా.!? ఎందుకని.!?

Non Veg: వర్షాకాలం (Monsoon)  మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…

1 hour ago

Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడిలో 18 మంది మృతి.. 30 మందికి గాయాలు

Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…

2 hours ago