Salaar: సలార్ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ ..ఇది పక్కా పాన్ వరల్డ్ సినిమా

Share

Salaar: ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు కనీసం 300 కోట్ల భారీ బడ్జెట్ ఉండాల్సిందే. ఆ సినిమా కనీసం 1000 కోట్లు వసూళ్ళు రాబడుతుందని అంచనాలు ఏర్పడుతున్నాయి. బాహుబలి, సాహో సినిమాల తర్వాత ప్రభాస్ కెరీర్ అసాధారణంగా మారిపోయింది. బాహుబలి సినిమాకు ముందు ఏ ఒక్కరు పాన్ ఇండియన్ స్టార్‌గా ప్రభాస్‌కు ఇంతటి క్రేజ్ వస్తుందని ఊహించలేదు. అలాంటిది ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియన్, పాన్ వరల్డ్ సినిమాల లిస్ట్ చూస్తే పాన్ వరల్డ్ స్టార్‌గా సౌత్‌లో ఆయనకొక్కరికి తప్ప మరెవరీ ఈ స్థాయిలో క్రేజ్ లేదనే చెప్పాలి.

prashanth neel planned salaar movie in hollywood range
prashanth neel planned salaar movie in hollywood range

సాహో తర్వాత ప్రభాస్‌కు బాలీవుడ్‌లో భారీగా క్రేజ్ పెరిగింది. దాంతో అక్కడ మేకర్స్ భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించి సినిమా నిర్మించాలని ట్రై చేస్తున్నారు. ప్రభాస్ సైన్ చేస్తానంటే ఇప్పటికిప్పుడు ధూమ్ సిరీస్‌లో 4వ భాగాన్ని ప్రకటించడానికి మేకర్స్ రెడీగా ఉన్నారు. దీనీ దృష్ఠిలో పెట్టుకొనే ఇప్పుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను హాలీవుడ్ సినిమాగా తయారు చేస్తున్నాడు. ఒక్క కేజీఎఫ్ ఛాప్టర్ 1తోనే ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. దాంతో మన టాలీవుడ్ స్టార్ అందరూ ఆయన దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.

Salaar: సలార్ సినిమాకు వాడుతున్న బ్లాక్ థీమ్ హైలెట్‌గా నిలవబోతోంది.

ఇక సలార్ సినిమాను హాలీవుడ్ సినిమాలకు ఉపయోగిస్తున్న హై టెక్నాలజీని ప్రశాంత్ నీల్ ఉపయోగిస్తున్నాడు. ఇప్పటికే సౌత్ భాషలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న మేజర్స్ ..ఇప్పుడు హాలీవుడ్ సినిమాగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకే మ్యాట్రిక్స్, బ్యాట్స్ మ్యాన్ వంటి హాలీవుడ్ సినిమాలకు ఉపయోగించిన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. భారీ యాక్షన్ సినిమాగా రూపొందుతున్న సలార్ ముంబై, హైదరాబాద్‌లలో షూటింగ్ జరుపుతున్నారు. జస్ట్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌తోనే ఊహించని విధంగా అంచనాలను పెంచిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ లుక్, సినిమాకు వాడుతున్న బ్లాక్ థీమ్ హైలెట్‌గా నిలవబోతోంది. హోంబలే నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.


Share

Related posts

మావోలు మళ్లీ వచ్చేశారు! వార్నింగులు ఇచ్చేశారు !! మరి కేసీఆర్ ఏం చేస్తారో?

Yandamuri

Face Tips: ముఖం మీద నల్ల మచ్చలా ?ఇలా  చేస్తే  మాయం !!

siddhu

పెళ్లి లేదు గిల్లి లేదు.. సింగిల్ గానే ఉంటా.. షాకింగ్ కామెంట్స్ చేసిన సుడిగాలి సుధీర్?

Varun G