Prashanth varma: అ.! సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. నేచురల్ స్టార్ నాని సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు టాలీవుడ్ దర్శక, నిర్మాతల ..హీరోల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత డా.రాజశేఖర్ హీరోగా కల్కి సినిమాను తెరకెక్కించి మంచి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతోనూ అదే ప్రశంసలను అందుకున్నాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు ప్రయోగాత్మకమైన చిత్రాలను తీసి హాట్ టాపిక్ అయ్యాడు.
ఇక గత చిత్రం జాంబిరెడ్డి ఎంతటి పేరు తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్‌గా బాగా పాపులర్ అయిన తేజా సజ్జాను ఈ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం చేశాడు ప్రశాంత్ వర్మ. జాంబిరెడ్డి సినిమా సూపర్ హిట్ సాధించి మంచి కమర్షియల్ హిట్‌గానూ నిలిచింది. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ సాధించిన ఈ యంగ్ డైరెక్టర్..అందరు దర్శకుల మాదిరిగా కమర్షియల్ సినిమాలను తెరకెక్కించే వాడు కాదని అతనిలో ఏదో కొత్త టాలెంట్ ఉందని మాట్లాడుకునేలా తనని తాను నిరూపించుకున్నాడు.
Prashanth varma: అమృత అయ్యర్ లుక్ రిలీజ్
ఈ క్రమంలోనే తాజాగా హను మాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇది పాన్ ఇండియన్ రేంజ్లో రూపొందిస్తున్నాడు. జాంబిరెడ్డితో హీరోగా మారిన తేజ సజ్జాను ఇందులో హీరోగా తీసుకున్నాడు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మంచి అంచనాలు పెంచుతూ వస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగా తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న అమృత అయ్యర్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్నా ఈ పోస్టర్ హను మాన్ సినిమాపై అంచనాలను మరో లెవల్లో పెంచేసింది.