PRC: 14.29 శాతం ఫిట్మెంట్..! సీఎం జగన్ కు పీఆర్సీపై సీఎస్ కమిటీ సిఫార్సు..! ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయంటే..?

Share

PRC: ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సీపై కమిటీ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ అందజేశారు. సీఎం జగన్మోహనరెడ్డి మరో 72 గంటల్లో కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఫిట్మెంట్ పై సీఎం జగన్ కు 11 ప్రతిపాదనలు ఇచ్చారు. పీఆర్సీ, ఫిట్మెంట్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని పేర్కొన్న సీఎం సమీర్ శర్మ పిఆర్సీ అమలుతో ప్రభుత్వానికి రూ.8వేల నుండి 10వేల కోట్ల అదనపు భారం పడుతుందని అన్నారు.

PRC recommendation report to cm jagan
PRC recommendation report to cm jagan

 

PRC: పిఆర్సీ పై సీఎస్ కమిటీ నివేదకలోని ముఖ్యమైన అంశాలు

ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్ మెంట్ ను సిఫార్సు చేసింది. 11వ వేతన సంఘం సిఫార్సులపైనా సీఎస్ కమిటీ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులపై పలు అంశాలను ప్రస్తావించింది. 2018 – 19 జీతాలు, పెన్షన్ల రూపంలో చేసిన వ్యయం రూ.52,513 కోట్లు అని, 2020- 21 నాటికి ఆ వ్యయం రూ.67.340 కోట్లకు చేరిందని సీఎస్ కమిటీ తెలిపింది. 2018 – 19 లో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం (ఎస్ఓఆర్)లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల మొత్తం 34 శాతమని, 2020 – 21 నాటికి అది 111 శాతానికి చేరుకుందని సీఎస్ కమిటీ పేర్కొంది.

PRC: 71 డిమాండ్ల పై సీఎం లేదా కమిటీ చర్చించాలి

సీఎస్ కమిటీ ఇచ్చిన సిఫార్సులపై ఏపీ జేఏసి అమరావతి, ఏపి జేఎసి నేతలు పెదవి విరిచారు. పిఆర్సీ నివేదకను ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఫిట్మెంట్ పెంచమని కోరతామన్నారు. ఐఆర్ ఇప్పటికే 27 తీసుకుంటున్నామన్నారు. ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు. సీఎం వద్ద చర్చ సందర్భంగా తమ డిమాండ్లు వినిపిస్తామన్నారు. పిఆర్సీ నివేదికలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఔట్ సోర్సింగ్ వారికి మినిమం పే, టైం స్కేల్ ఇవ్వాలని కోరామన్నారు. పిఆర్సీ నివేదిక నాలుగు వాల్యూమ్ లు ఆన్ లైన్ లో పెట్టలేదని పాక్షికంగానే ఉంచారని బొప్పరాజు అన్నారు. సీపీఎస్, డీఏల విషయంపై ఏమీ మాట్లాడలేదని పేర్కొన్నారు. ఉద్యోగుల 71 డిమాండ్ల పై సీఎం లేదా కమిటీ తమ చర్చించాలని కోరారు. తమ ఉద్యమానికి తొమ్మిది మందితో స్ట్రగుల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బొప్పరాజు పేర్కొన్నారు.


Share

Related posts

అమెరికా 46వ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్

somaraju sharma

Samantha : సమంత కి బిగ్ బ్యాడ్ న్యూస్ చెప్పిన కృతి శెట్టి .. అమ్మో చిన్న పిల్ల అనుకుంటాం కానీ మామూలుది కాదు !

Ram

తండ్రికి జగన్ నివాళి!

somaraju sharma