పొట్టలో ఉండే అధిక కొవ్వు గుండె జబ్బులు మరియు స్ట్రోక్తో సహా అనేక ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఒక్కసారి కనుక బొజ్జ వచ్చిందంటే దాన్ని తగ్గించడం అంత తేలిక కాదు. పొట్ట చుట్టూ కొవ్వు పెరిగితే బొజ్జ పెరిగిపోయి చూసేందుకు కాస్త ఇబ్బందిగా కనిపిస్తుంది. ఆ సంగతి అలా వుంచితే అది అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది.
కడుపులో కొన్ని అంగుళాల వరకు కొవ్వు పేరుకుపోతే దాన్ని తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు వ్యాయామం ఒక్కటే సరిపోదు. ఆరోగ్యకరమైన జీవనశైలి, వ్యాయామంతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల పొట్టలోని అధిక కొవ్వును తగ్గించుకోవచ్చు.
మారుతున్న జీవనశైలి, తీరిక లేని బిజీ షెడ్యూలులో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఊబకాయులుగా మారిపోతున్నారు. మరియు మరి కొందరైతే పొట్ట పెంచేస్తున్నారు. ఆ తర్వాత ఈ పొట్టను సులువుగా తగ్గించే మార్గమేది అని చింతిస్తు వేల రూపాయలు ఖర్చుచేస్తున్నారు.
ఇలా పొట్టలో కొవ్వు పెరగకుండా ఉండాలంటే ప్రతి రోజూ తీసుకొనే ఆహారాన్ని చిన్న మొత్తంలో నిదానంగా బాగా నమిలి తినాలి. ఇలా చెయ్యడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. దాంతో పొట్టలో గ్యాస్ సమస్యను, కడుపు ఉబ్బరాన్ని చాలా తేలికగా తగ్గించవచ్చు.
బెల్లి ఫ్యాట్ కు ముఖ్య కారణం మనం రోజూ ఆహరం లో తీసుకునే ఉప్పు. సీ సాల్ట్ లో సోడియం మోతాదు తక్కువగా ఉంటుంది కాబట్టి దానిని ఉపయోగించడం చాలా ఉత్తమం. కొవ్వు కలిగిని ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి వాటికి బదులు పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. మీరు తీసుకొనే ఆహారంలో ధాన్యాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల బెల్లీ ప్యాట్ ను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.