మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్ కి ఉన్న ఫాలోయింగ్ అంత ఇంత కాదు. సీరియల్ లలో సెపరేట్ గా కార్తీక దీపం సీరియల్ కి ఫ్యాన్స్ ఉన్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు ఆ సీరియల్ ఎంత పాపులరో. అందులో వంటలక్క గా నటించిన ప్రేమి విశ్వనాధ్ కి ఒక రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె తెలుగు లో నటించింది ఒక్క సీరియల్ లోనే అయినా హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది.
ఇప్పటివరకు ఏ సీరియల్ కి రాని విధంగా కార్తీకదీపం సీరియల్ కి అధిక రేటింగ్ లు వచ్చాయి. ఈ సీరియల్ లో కథా, కథనాలు మనకి రొటీన్ గానే అనిపించినా ఆ పాత్రల్లో నటించే నటులు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నారు. అందులో ముఖ్యంగా కథానాయిక ప్రేమి విశ్వనాథ్ అయితే తెలుగు ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నారు.
ప్రేమి విశ్వనాథ్ అలియాస్ దీప కరసముత్తు అనే మలయాళం సీరియల్ ద్వారా టీవీ రంగంలోకి తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత తెలుగులో అదే సీరియల్ ను కార్తీకదీపం గా రీమేక్ చెయ్యడానికి ప్రేమి విశ్వనాధ్ నే ఇందులోనూ చెయ్యమని అడగగా ఆమె ఒప్పుకున్నారు. దీనితో ఆ సీరియల్ బాగా ఫేమస్ అయ్యింది.
ఇక ఈమెకు ప్రేక్షకులలో ఉన్న ఆదరణను చూసి ప్రేమి విశ్వనాథ్ కు సినిమాల్లో నటించడానికి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఈమె కేవలం సీరియల్ లలో నటించడమే కాకుండా వాటితో పాటుగా పలు గేమ్ షోలకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే కొన్ని యాడ్స్ లో కూడా ప్రేమి విశ్వనాథ్ నటించారు.
అయితే, ప్రేమి విశ్వనాథ్ ఆదాయం విషయానికి వస్తే, ఆమెకు సుమారు 36 కోట్ల రూపాయలు వస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేవలం సీరియల్ లలోనే నటిస్తూ ప్రేమి విశ్వనాథ్ సినిమా హీరోయిన్ల స్థాయిలో ఆస్తులను సంపాదించారు. ఇక కార్తీకదీపం సీరియల్ లో నటించేందుకు ఈమెకు ఒక్కరోజుకి 20 వేల పారితోషకం ఇస్తున్నారట.