శీతాకాల విడిదికి చేరుకున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ లోని హకీంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్, సీఎం కేసీఆర్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. ఈ నెల 24 వరకూ ఆయన అక్కడే బస చేస్తారు. 24 సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళతారు. రాష్ట్రపతి రాక సందర్భంగా రాష్ట్రపతి నిలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.