ద్రౌపది ముర్ము ఘన విజయం -రాష్ట్రపతి పీఠం అధిష్టించనున్న తొలి ఆదివాసీ మహిళ.. ప్రధాని మోడీ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి..

Share

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. అందరూ ఊహించినట్లుగానే ప్రత్యర్ధి యశ్వంత్ సిన్హా పై ద్రౌపది ముర్ము భారీ ఆధిక్యం సాధించారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 104 మంది ఎమ్మెల్యేలు, 17 మంది విపక్షాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ద్రౌపది ముర్ముకు క్రాస్ ఓటింగ్ చేయడంతో ఊహించినదాని కంటే అధిక మెజార్టీ లభించింది. తొలి సారిగా ఆదివాసీ మహిళకు అవకాశం దక్కనుండటంతో ఆయా పార్టీల స్టాండ్ కు భిన్నంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ద్రౌపది ముర్ముకు ఓటు వేశారు. ఈ విజయంతో రాష్ట్రపతి పీఠం అధిష్టించే తొలి ఆదివాసి మహిళగా చరిత్ర లో నిలిచిపోనున్నారు ద్రౌపది ముర్ము. మూడో రౌండ్ ముగిసే సమయానికి ద్రౌపది ముర్ము 50 శాతం మార్కు దాటేశారు. ద్రౌపది ముర్ముకు మూడవ రౌండ్ ముగిసే సమయానికి ఓటు విలువ 5,77,777 కాగా, యశ్వంత్ సిన్హాకు పోలైన మొత్తం ఓటు విలువ 2,61,062 గా ఉంది.

ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ

భారత 15వ రాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ద్రాపది ముర్ము నివాసానికి వెళ్లి అభినందలు తెలియజేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో కలిసి ఆమె నివాసానికి వెళ్లిన మోడీ .. పుష్పగుఛ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అజాద్ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న ఈ తరుణంలో ఓ ఆదివాసి గ్రామీణ మహిళ రాష్ట్రపతి గా ఎన్నిక కావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు మోడీ. విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హా కూడా ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించడంతో బీజేపీ జాతీయ పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ద్రౌపది ముర్ము నివాసం వద్ద ఆదివాసి సంప్రదాయ నృత్యాలతో వేడుకలు చేసుకుంటున్నారు. మరో పక్క ద్రౌపది ముర్ము స్వగ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు అందరూ సంబరాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా రాష్ట్రాల్లో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్య నేతలు ద్రౌపది ముర్మకు అభినందనలు తెలియజేస్తున్నారు.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

40 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago