ట్రెండింగ్ న్యూస్

కంటతడి పెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Share

దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం రోజున దేశవ్యాప్తంగా ప్రారంభించారు.యాక్షన్ పంపిణీ ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది అన్నారు..శాస్త్రవేత్తల కృషి ఫలితంగా దేశంలో వ్యాక్సిన్ త్వరగా అందుబాటులోకి వచ్చిందన్నారు. కరోనా యోధుల పోరాటాన్ని గురించి ఇవాళ తన ప్రసంగంలో ప్రస్తావించిన ప్రధాని మోడీ మాట్లాడుతూ ఒక సందర్భంలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎన్నో ఇబ్బందులు పడ్డారని, విధులు నిర్వహించడం కోసం కొంతమంది ఇంటికి కూడా వెళ్లలేదని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు..

Prime Minister Narendra Modi in tears

 

వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు కరోన విజృంభిస్తున్న సమయంలో సేవలందించారని కొనియాడుతూ వ్యాక్సిన్ పంపిణీలో తొలి ప్రాధాన్యత వారికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. కరోనా వాక్సినేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాయి. మరికొన్ని స్వదేశీ వ్యాక్సిన్ లు కూడా రానున్నాయని అన్నారు. మొదటి రోజు ఎవరెవరికి వ్యాక్సింగ్ వేయనున్నారు దానిపై ముందుగా నిర్ణయించిన ప్రకారం వారికి వ్యక్తిగతంగా సెల్ఫోన్ కు ఎస్ఎంఎస్ ద్వారా మెసేజీలు పంపామని తెలిపారు.

Prime Minister Narendra Modi in tears

కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాక్ డౌన్ విధించిన కాలంలో ఎంతోమంది పనులు లేక క తిండికోసం అవస్థలు పడ్డారని అన్నారు. కరోనా వైరస్ ఎంతోమంది ప్రాణాలు తీసింది అని వారికి సంప్రదాయ ప్రకారం కూడా అంత్యక్రియలు చేయలేదని చెప్పారు. ఈ వైరస్ ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చిందని మోడీ అన్నారు.

 


Share

Related posts

సోహెల్, మెహబూబ్ కలిస్తే కథ వేరే ఉంటది?

Varun G

SEC : మున్సిపల్ ఎన్నికలపై నిమ్మగడ్డ తాజా ఆదేశాలు ..

somaraju sharma

ఆంధ్ర ప్రదేశ్ హోం మంత్రి వెనకా ముందూ అటూ ఇటూ ఇంత రాజకీయం నడుస్తోందా ? 

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar