NewsOrbit
న్యూస్

ఆయన నిర్ణయాలు ఆ’మోదీ’యం..!!

prime minister narendra modi

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ 2014లో పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. వీటివల్ల దేశంలో మోదీ ప్రభావం దేశంపై బలంగా పడింది. ప్రపంచంలో భారత ఉనికి ఘనంగా చాటుకుంది. యావత్ భారతావని అభీష్టం మేరకే మోదీ నిర్ణయాలు అన్నట్టుగా ఆయన చేతల్లో తన పనితనం చూపించారు. వాటిలో కొన్నింటిని క్లుప్తంగా విశ్లేషిస్తే..

prime minister narendra modi
prime minister narendra modi

నోట్ల రద్దు..

దేశంలో నోట్లరద్దు అంశం నాలుగేళ్ల క్రితం పెద్ద సంచలనం సృష్టించింది. బ్లాక్ మనీని కట్టడి చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. 1988లో చివరిసారిగా పెద్ద నోట్లు రద్దు చేశారు. మళ్లీ మోదీ ప్రధాని అయ్యాక 2016 నవంబర్ లో నోట్ల రద్దు జరిగింది. దేశాన్ని పట్టి పీడిస్తున్న నల్ల ధనాన్ని అరికట్టేందుకు మోదీ తీసుకున్న సాహసోపేత చర్యగా.. విప్లవాత్మక నిర్ణయంగా చెప్పాలి.

సర్జికల్ స్ట్రైక్స్..

ప్రధానిగా మోదీ హయాంలో పాకిస్థాన్ ఉగ్రవాద మూకల స్థావరాలపై జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ఓ సంచలనం. ప్రణాళిక వేయడం దగ్గర నుంచీ ప్రాణ నష్టం లేకుండా ఆపరేషన్ విజయవంతం చేయడంలో మోదీ చూపిన చొరవ.. శత్రు దేశానికి పంపిన హెచ్చరికలు దేశవ్యాప్తంగా మోదీ పేరు మోగిపోయేలా చేశాయి. మన సైనిక స్థావరాలపై, సైన్యంపై దొంగదెబ్బ తీసిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు మోదీ చెప్పిన సమాధానం చరిత్రలో నిలిచిపోతుంది.

జీఎస్టీ..

ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో అమలులో ఉన్న జీఎస్టీని మన దేశంలో ప్రవేశపెట్టడం అంటే దానికి చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. దీనిని విజయవంతంగా అమలు చేశారు. ఒకే దేశం.. ఒకే పన్ను విధానం తీసుకొచ్చారు. దేశం ఆర్దిక పునాదుల మీద దెబ్బ పడకుండా పన్నులు ఎగ్గొట్టే వారి నడ్డి విరిచేలా తీసుకొచ్చిన జీఎస్టీ దేశంలో విజయవంతం అయిందని చెప్పాలి. పన్నుల అమలులో ఖచ్చితత్వం వచ్చింది. వస్తువులు, సేవల వర్గీకరణ పరంగా పన్నులన్నీ ఖచ్చితంగా అమలవుతాయి. అత్యధిక వస్తువులకు పన్నుల నుంచి ఉపశమనం లభించింది. చాలా వస్తువులు 5 శాతం పన్నుల పరిధిలోకి వచ్చాయి.

ఆర్టికల్ 371..

జమ్ము కశ్మీర్ లో ఉన్న ఈ ప్రత్యేక ప్రతిపత్తి వల్ల ఆ రాష్ట్రంపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అమలు సాధ్యం కాదు. దాంతో భారత రాష్ట్రపతికి ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు కూడా ఉండదు. రాష్ట్రపతి జమ్ము-కశ్మీర్‌లో ఆర్థిక అత్యవసర స్థితి అమలు చేయలేరు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ఆర్టికల్ 370 తొలగిస్తామని చెప్పింది. 2019లో చేసి చూపించింది.

 

 

 

author avatar
Muraliak

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju