NewsOrbit
న్యూస్

ఇదీ జగన్ అంటే..! ఇక కుయ్ కుయ్ ఖాయం

 

అమరావతి : నవ్యంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద కారణంగా 108 అంబులెన్సు వ్యవస్థకు పూర్వ వైభవం వస్తున్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 108,104 వాహనాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నది ప్రభుత్వం. నూతన వాహనాలను జులై 1వ తేదీన సి.ఎం.జగన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తారని ఆరోగ్యశ్రీ సి.ఈ.ఓ.మల్లికార్జునరావు తెలిపారు. నూతన వాహనాల్లో వెంటిలేటర్,ఇన్ ఫుజాన్ పుంప్స్, సిరంజి పుంప్స్ ఉంటాయి. చిన్నారుల కోసం 26 నియోనేటల్ అంబులెన్సు లు అందుబాటులో ఉంచుతున్నారు. 203.47 కోట్ల రూపాయలతో ఈ వాహనాలు కొనుగోలు చేసినట్లు మల్లికార్జున రావు చెప్పారు. మండలానికి ఒక 104 వాహనం అందుబాటులో ఉంచనున్నారు.108 అంబులెన్సులు 412 సిద్ధం చేశారు. అడ్వాన్స్ లైఫ్ సపోర్టు వాహనాలు 104, లైఫ్ సపోర్టు బేసిక్ వాహనాలు 282, 104 వాహనాలు 676 అందుబాటులోకి తీసుకువచ్చారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ ప్రమాదం జరిగినా 20 నిమిషాల్లో, పట్టణ ప్రాంతంలో అయితే 15 నిమిషాల్లో అక్కడకు వాహనం వెళుతుందని అయన తెలిపారు. అదే ఏజెన్సీ ప్రాంతంలో అయితే 25 నిమిషాల్లో 108 అంబులెన్సు చేరుకుంటుందని చెప్పారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 108 అంబులెన్సు వ్యవస్థ చాలా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం తెలిసిందే. వివిధ బహిరంగ సభల్లోనూ నాడు వైఎస్ఆర్ ఒక్క ఫోన్ కాల్ చేసిన వెంటనే కుయ్ కుయ్ అంటూ నిమిషాల వ్యవధిలో అంబులెన్సు ఘటనా స్థలానికి వచ్చేదని వివరించిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్ మరణానానంతరం కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు హయాంలో చాలా 108 అంబులెన్సులు పాడవ్వడం, స్క్రాప్ కు తరలించడం జరిగింది. దీనితో వైఎస్ హయాంలో మాదిరిగా 108 అంబులెన్సుల నిర్వహణ జరగలేదని ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల ప్రచార సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ, 108 సేవలకు పూర్వ వైభవం తీసుకొని వస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆధునిక పరిజ్ఞానంతో 108, 104 వాహనాలను అందుబాటులోకి తీసుకొని రావడంతో ఈ సేవలకు పాత రోజులు రాబోతున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N