రాజమండ్రి మహిళా సెంట్రల్ జైలు నుంచి 19 మంది మహిళా ఖైదీలు రిలీజ్ అయ్యారు. వీళ్లంతా జీవో 151 ద్వారా 5 సంవత్సరాల శిక్ష కాలం పూర్తి చేసుకున్న మహిళా ఖైదీలకు క్షమాభిక్షపై విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జైలు బయట ఖైదీల బంధువులు రావడంతో వాళ్ల కుటుంబాల తో మళ్లీ వేళ్ళి కలుసుకోవడంతో అక్కడ ఆహ్లాద వాతావరణం నెలకొంది.
ఇచ్చిన జీవో బట్టి జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అని మహిళా ఖైదీలు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో జైలులో ఉన్నంతకాలం ఉన్నత అధికారులు బాగా చూసుకున్నారని మహిళా ఖైదీలు వారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు చాలా కాలం తర్వాత మళ్లీ కుటుంబ సభ్యులతో బయట ప్రపంచంలో జీవిస్తామని ఎన్నడూ అనుకోలేదు.. జైలులో ఉన్నంతకాలం బయట ఏవిధంగా పని చేసుకుని బతకాలో తెలుసుకున్నాం అని మహిళా ఖైదీలు తెలిపారు.
దాదాపు మహిళా ఖైదీలు ఎక్కువగా వరకట్న వేధింపులు కేసుల విషయంలోనే జైలుకు వెళ్లినట్లు తెలుస్తోంది. దాదాపు 5 సంవత్సరాల పాటు జైలులో శిక్షాకాలం అనుభవించటం తో వీరందరిని ఏపీ ప్రభుత్వం సరికొత్త ఉత్తర్వులతో రిలీజ్ చేయటం జరిగింది. ఒక్క సెంట్రల్ జైలు నుంచి మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జైళ్లలో నుంచి 53 మంది ఖైదీలు జగన్ సర్కార్ తాజా ఉత్తర్వులతో రిలీజ్ అవ్వడం జరిగింది. దీంతో చాలా కాలం తర్వాత మహిళా ఖైదీలు బయట ప్రపంచంలో అడుగుపెట్టడంతో వాళ్లలో సంతోషం నెలకొంది. ఇంకోసారి తప్పు జరగకుండా ఈసారి బయట ప్రపంచంలో జాగ్రత్తగా బతుకుతామని పేర్కొంటున్నారు.