NewsOrbit
న్యూస్

జగన్ దారిలోనే హర్యానా సీఎం కూడా..! కానీ ట్విస్టులున్నాయ్..!!

 

 

ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కార్పొరేట్‌ రంగం మీదే ఆధారపడింది. ప్రభుత్వాలకు వచ్చే ఆదాయంలో కార్పొరేట్ కంపెనీ లు చెలించే‌ పన్ను శాతమే ఎక్కువ. ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహిస్తూ కంపెనీలు ఇచ్చే పన్నుల ఆదాయంతో ఓట్ల కోసం సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ప్రభుత్వాలు కార్పొరేట్‌ సంస్థలను రిజర్వేషన్ల విషయంలో కట్టడి చేయనున్నాయి… ప్రైవేట్‌ రంగం లోని పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలి అన్ని హర్యానా ప్రభుత్వం బిల్ ను ప్రవేశ పెట్టింది. ప్రతిపక్షాల నుండి పాలక కూటమి సభ్యుల నుండి తీవ్ర అభ్యంతరం ఉన్నప్పటికీ ఈ బిల్లు ఆమోదించబడింది, ఈ విధానానికి మంత్రిమండలి ఆమోదం కూడా లభించింది. అయితే ఈ బిల్ విషయంలో పరిశ్రమలలో,ప్రతిపక్ష పార్టీలలో తీవ్ర కలకలం రేపుతోంది. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా 2019 ప్రైవేట్ రిజర్వేషన్ బిల్ ను ప్రవేశ పెట్టారు.

 

Factory workers

అసలు ఏంటి ఈ బిల్:
ప్రైవేట్‌ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్‌ రాష్ట్ర నివాసితుల కోసం కేటాయించడం తప్పనిసరి చేస్తూ కల్పించే బిల్లును హర్యానా అసెంబ్లీ ఆమోదించింది. నెలకు రూ.50 వేల కంటే తక్కువ వేతనం ఉన్న పోస్టులకే ఇది వర్తిస్తుంది. ఒకవేళ ఆ పోస్టునకు సరైన స్థానిక అభ్యర్థి లభించని పక్షంలో ప్రభుత్వానికి ఆ సమాచారాన్ని తెలియజేసి స్థానికేతరులను నియమించుకోవచ్చన్న మినహాయింపు ఉన్నది. మరోవైపు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 19 ప్రకారం చట్టం ముందు సమానత్వం, భారతదేశంలో ఎక్కడైనా ఏదైనా వృత్తిని నిర్వహించుకునే హక్కుకు ఈ బిల్లు వ్యతిరేకంగా ఉన్నది. ఈ బిల్లు చట్టంగా మారితే హర్యానాలోని ప్రైవేట్‌ సంస్థల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిపాదిత చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయా సంస్థలపై రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ప్రైవేట్‌ సంస్థల్లో స్థానికులకు ఉద్యోగ నియామకాలపై పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమిస్తారు.ప్రతి యజమాని నియమించబడిన పోర్టల్‌లో నియమించబడిన ఉద్యోగి ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సివుంటుంది, దీన్ని ఆధారంగా అభ్యర్థి స్థానికతను నిర్ధారిస్తారు. నియమించబడిన స్థానిక అభ్యర్థుల త్రైమాసిక నివేదికను కూడా అందించాలి. .యజమాని 75 శాతం రిజర్వేషన్ నుండి మినహాయింపు పొందాలి అంటే, ప్రభుత్వం నియమించిన అధికారులు అనుమతి తప్పని సరి. ఈ బిల్లులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి అనుబంధంగా ఉన్న మరే ఇతర సంస్థ కూడా లేదు. ఒక సంస్థ ద్వారా రిక్రూట్‌మెంట్‌లో కేవలం 10 శాతం మాత్రమే అది ఉన్న జిల్లాకు కావాల్సి ఉంటుందని, మిగిలినవి హర్యానాలోని ఇతర జిల్లాల నుంచి ఉండవచ్చని బిల్లు పేర్కొంది. అలాగే, రిజర్వేషన్ విధానం పదేళ్లపాటు వర్తిస్తుంది అన్ని తెలిపింది.

బిల్ ముఖ్య ఉద్దేశ్యం:
స్థానిక మౌలిక సదుపాయాలు,గృహాలను ప్రభావితం చేసే తక్కువ వేతన ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వలస రావడం తో, మురికివాడల విస్తరణకు దారితీసింది. దీనితో పర్యావరణ ఆరోగ్య సమస్యలు భారీగా పెరిగిపోయాయి. ఈ కారణముగా హర్యానాలోని పట్టణ ప్రాంతాలు తీవ్రంగా భావించబడాయి, ఇది జీవన ప్రమాణాలను మరియు జీవనోపాధిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల, తక్కువ వేతన ఉద్యోగాలకు స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణానికి అవసరమైనది, అన్నే ఉద్దేశ్యం తో ఈ బిల్ను ప్రవేశ పెట్టారు. ప్రైవేటు రంగంలో హర్యానాలోని స్థానిక పౌరులకు మెరుగైన ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేయడానికి బిల్లు ను ప్రవేశ పెట్టారు. అర్హత కలిగిన స్థానిక శ్రామిక శక్తిని పొందగల ప్రైవేట్ యజమానులకు ఇది గొప్ప ప్రయోజనాలను ఇస్తుందని కూడా ఆశిస్తోంది.

బిల్ కు వ్యతిరేకత:
హర్యానా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై కంపెనీలు పెదవి విరుస్తున్నాయి. దీంతో తమ పోటీ తత్వం తగ్గే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. హర్యానాకు పెట్టుబడులు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఇదివరకు ఉన్న ఉపాధి కల్పన బాగుందని చెప్పారు. నార్నాండ్కు చెందిన జేజేపీ ఎమ్మెల్యే రామ్ కుమార్ గౌతమ్ ఖండించారు.
ఈ బిల్లును “హాస్యాస్పదమైన చట్టం” మరియు “100 శాతం తప్పు” అని పిలిచారు. దేశం ప్రతీ ఒక్కరిదీ అని.. ఎందుకీ పక్షపాతం అన్నారు. పంటల కోసం బీహరీలు మన వద్దకు, హర్యానాకు చెందిన వారు ఇతర ప్రాంతాలకు వెళుతుంటారని తెలిపారు. కానీ సర్కార్ తీసుకొచ్చిన చట్టం బాగోలేదన్నారు. మన పిల్లలు ఇతర రాష్ట్రాలకు వెళితే పరిస్థితి ఏంటీ అని అడిగారు. అక్కడ వారిని పనిచేయకుంటే ఏం చేయాలన్నారు. బిల్లులో కొన్ని సవరణలు చేయాలని ప్రతిపక్షాలు కోరాయి. కానీ అధికార పక్షం పట్టించుకోలేదు. తమకు 90 మంది సభ్యుల బలం ఉంది అని ప్రవేశపెట్టి.. ఆమోదింపజేసుకుంది. ప్రతిపక్ష నేత భూపిందర్ సింగ్ హుడా అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష నాయకుడు భూపిందర్ సింగ్ హుడా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇలాంటి నిబంధనను తీసుకువచ్చారని అధికార పక్షం తెలిపారు. “హర్యానా స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్ఎస్ఐఐడిసి) ఏ పరిశ్రమకు క్లియరెన్స్ ఇవ్వదు తప్ప అది రాష్ట్రం నుండి ప్రజలను నియమించుకుంటుందని అఫిడవిట్ ఇస్తుంది. అయితే, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ ఇలా అన్నారు: “అటువంటి నిబంధన హెచ్‌ఎస్‌ఐఐడిసిలో ఉంది. ఇది మా ఆరేళ్ల పదవీకాలంలో కూడా ఉంది. వాస్తవం ఏమిటంటే ఇది ఏ ప్రభుత్వ పదవీకాలంలోనూ సరిగా పర్యవేక్షించబడలేదు ఎందుకంటే ఇది శాసన నిబంధన కాదు. మేము దానిని పర్యవేక్షించడం ప్రారంభించినప్పుడు, దీనిని శాసన నిబంధనగా చేయవలసిన అవసరం ఉందని మేము కనుగొన్నాము. మేము పరిశ్రమ ప్రయోజనాలను కూడా రక్షించుకోవాలి అన్ని తెలిపారు.

హర్యానాలో పట్టు సాధించిన మారుతి,హ్యుందాయ్‌తో సహా పలు అగ్ర పరిశ్రమలు ప్రభుత్వ చర్యపై ఆందోళన వ్యక్తం చేశాయి. తమ పోటీ తత్వం తగ్గే అవకాశం ఉన్నందున్న మారుతి తన యూనిట్లలో ఒకదానిని హర్యానా నుండి మార్చే యోచనలో ఉంది అన్ని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు.

పక్క రాష్ట్రాలలో:
ఇదే ప్రాతిపదికన, సంవత్సరం కిందట ప్రైవేట్‌ రంగంలోని పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎ.పి. ఎంప్లాయిమెంట్‌ ఆఫ్‌ లోకల్‌ క్యాండిడేట్స్‌ ఇన్‌ ఇండస్ట్రియల్‌/ ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌ 2019 పేరుతో చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని హైకోర్టులో సవాలు చేశారు. ఎపి లో కూడా ఈ బిల్ ను ఆమోదించడం కష్టతరమైన విషయమే. ఉదాహరణకు: ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ ఖ్వారి ల లో పని చేయడానికి 25000 మంది ఉండగా, వారిలో 20000 మంది బీహార్, ఒడిస్సా నుండి వచ్చిన వారే. దీనికి కారణం అక్కడ ఉన్న ప్రజలు తక్కువ వేతనానికి పని చేయలేకపోవడమే.. హర్యానా లో కూడా ఇదే పరిస్థితి ఉండడం తో, 75 % ప్రైవేట్ ఉద్యోగాల రిజర్వేషన్ బిల్ మంచిదే అయినప్పటికీ, ప్రైవేట్ఎం సంస్థలు దీనిలో ఇబ్బందులు ఎదురుక్కొనే సమస్యలు చాలానే ఉన్నాయి. ఈ బిల్ ఎంత వరకు సరి అయినది అనేది ప్రశ్న ఇపుడు..?

 

Related posts

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju