NewOrbit
తెలంగాణ‌ న్యూస్

Fire Accident: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం

Share

Fire Accident: నిజంగా వాళ్లంతా అదృష్టవంతులు. సామాన్లు అగ్నికి ఆహుతి అయినా ఫరవాలేదు. ప్రాణాలతో బయటపడ్డారు. అదే పదివేలు. నాగ్ పూర్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై నిర్మల్ జిల్లా గంజాల్ టోల్ ప్లాజా వద్ద ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆ ప్రైవేటు బస్సు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. అయితే ప్రయాణీకులు అందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Private Travel Bus Catches fire in Nirmal district
Private Travel Bus Catches fire in Nirmal district

 

విషయంలోకి వెళితే… నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజన్ నుండి పొగలు వస్తుండటాన్ని గమనించిన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు నిలుపుదల చేసి ప్రయాణీకులను అప్రమత్తం చేశారు. దీంతో ప్రయాణీకులు అందరూ బస్సు దిగారు. ప్రయాణీకులు తమ లగేజీని బయటకు తీసుకునే లోపుగానే బస్సు మొత్తానికి మంటలు వ్యాపించాయి. బస్సు దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో 29 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీస్, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపుచేశారు. ప్రయాణీకులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Advertisements

Share

Related posts

ఒంటరైన ఆ కంఠ బానిసలు..! బాలూకి “న్యూస్ ఆర్బిట్” అశ్రునివాళి..!

Srinivas Manem

Earthqeakes: ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరుస భూకంపాలు..! మేఖాలయ, అసోం, మణిపూర్ లో మళ్లీ ప్రకంపనలు..!!

somaraju sharma

ఉప ఎన్నికకూ ఓ చరిత్ర ఉంది!ఒక్క సీటు అనుకోకండి.. బొక్కబోర్లాపడతారు!!

Yandamuri