ట్రెండింగ్ న్యూస్

Priya Prakash Varrier : క్యాష్ షోలో సందడి చేసిన ప్రియా ప్రకాశ్ వారియర్

priya prakash varrier in cash program
Share

Priya Prakash Varrier : ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను కన్ను కొడితే చాలు.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. కుర్రాళ్ల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుందరి ప్రియా వారియర్. అప్పట్లో తను కన్ను కొట్టి… చేతి గన్ తో పేల్చే సీన్ ను ఎన్నటికీ తెలుగు ప్రేక్షకులు మరిచిపోరు. తను మలయాళి అయినా.. తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో తను తన సొంత ఇండస్ట్రీని వదిలేసి మరీ టాలీవుడ్ కు వచ్చి సెటిల్ అయింది. తెలుగులో హీరోయిన్ గా బాగానే సినిమాలు తీస్తోంది.

priya prakash varrier in cash program
priya prakash varrier in cash program

తాజాగా ప్రియా ప్రకాశ్ వారియర్… జాంబి రెడ్డి హీరో తేజ సజ్జాతో కలిసి ఇష్క్ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో ఇష్క్ టీమ్… క్యాష్ షోలో సందడి చేసింది. ఇష్క్ హీరో తేజ, హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్, సినిమా నటులు గీతా భగత్, వింధ్య… వీళ్లంతా కలిసి క్యాష్ షోలో చేసిన సందడి మామూలుగా లేదు.

Priya Prakash Varrier : తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ప్రియా వారియర్

అయితే.. మలయాళీ అయిన ప్రియా వారియర్.. తెలుగు ఇండస్ట్రీకి వచ్చాక బాగానే తెలుగు నేర్చుకుంది. తెలుగులో మాట్లాడి మంచి మార్కులే కొట్టేసింది. ఇక్కడి నీళ్లు బాగానే వంటపట్టినట్టున్నాయి. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో సెట్ అయిపోయిన ప్రియా వారియర్ ఇంకా మంచి సినిమాలు చేయాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

ఇక.. క్యాష్ షోలో యాంకర్ సుమతో కలిసి ప్రియా వారియర్ చేసిన సందడికి సంబంధించిన ప్రోమోను చూసేయండి.


Share

Related posts

బ్రేకింగ్: మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్ పొడిగింపు

Vihari

Bollywood- Tollywood: టాలీవుడ్ బాటపడుతున్న బాలీవుడ్ భామలు.. షాక్ లో బాలీవుడ్?

Ram

Ys Jagan Mohan Reddy : ఏపీ కి స్పెషల్ స్టేటస్ అంటూ మోడీ ముందు జగన్ కీలక కామెంట్స్..!!

sekhar