Priyanka arul mohan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా సెటిలవ్వాలని అలాగే సౌత్ మొత్తం లో క్రేజీ హీరోయిన్ గా పాపులారిటీ సాధించుకోవాలని ఎంతో మంది అమ్మాయిలు, మోడల్స్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్న విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొన్ని ఏళ్ళుగా పర భాషలోని హీరోయిన్స్ ఇక్కడ పాగా వేసి పాపులారిటీ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆ ప్రయత్నాలలో కొంతమంది అమ్మాయిలు సక్సెస్ కాలేక వచ్చిన దారిలోనే వెనక్కి వెళుతున్నారు. కొంతమంది మాత్రం పాన్ ఇండియన్ స్థాయిలో క్రేజ్ దక్కించుకొని ఒక వెలుగు వెలుగుతూ వరుసగా అవకాశాలను పొందుతున్నారు.
ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక యంగ్ బ్యూటీ కూడా నెమ్మదిగా తన సత్తా చాటుతోంది. తెలుగులో మాత్రమే అవకాశాలు అందుకుంటుందనుకుంటే తన సత్తా తమిళ ఇండస్ట్రీలో కూడా చూపిస్తోంది. వరుసగా అవకాశాలు అందుకుంటూ షాకుల మీద షాకులిస్తుంది. ఆమె ప్రియాంక అరుళ్ మోహన్. ఈమె డైరెక్టర్, మనం ఫేం విక్రం కె కుమార్ తెరకెక్కించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు పరిశ్రమకి పరిచయం అయింది. ఇందులో నాని హీరోగా నటించగా ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ విలన్గా నటించాడు. ఈ సినిమాలో ప్రియాంకకి మంచి పర్ఫార్మర్ అని పేరు బాగానే వచ్చింది.
Priyanka arul mohan : ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా క్రేజీ ఛాన్సెస్ అందుకుంటోంది.
దాంతో తెలుగులోనే మరొక సినిమా చేసే ఛాన్స్ వెంటనే అందుకుంది. శ్రీకారం అనే సినిమాలో శర్వానంద్ కి జంటగా నటించి మెప్పించింది గ్యాంగ్ లీడర్ బ్యూటీ. ఇలా తెలుగులో రెండు సినిమాలు చేసిందో లేదో అలా తమిళ పరిశ్రమ నుంచి కాల్స్ వచ్చాయి. అక్కడ శివ కార్తికేయ హీరోగా నటిస్తున్న డాక్టర్ అనే తమిళ సినిమాలో నటిస్తోంది. అంతేకాదు అక్కడ డెబ్యూ సినిమా రిలీజ్ కాకుండానే మరో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ఫిల్మ్ లో హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. స్టార్ డైరెక్టర్ పాండిరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా..దాదాపు 30 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టు సమాచారం. ఇలా తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా క్రేజీ ఛాన్సెస్ అందుకుంటోంది.