Bigg Boss 5 Telugu: శ్రీరామ్ కెప్టెన్… మానస్ కి వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక సింగ్..!!

Share

Bigg Boss 5 Telugu: నాలుగో వారం కెప్టెన్సీ కం టెండర్స్ టాస్క్ కి..సన్నీ-మానస్‌, హమీదా- శ్రీరామచంద్ర, యానీ మాస్టర్‌- శ్వేత జంటలు ఎక్కువ బరువు కోల్పోవడం జరిగింది. అయితే ఈ ఒకో జంట లో.. ఒకరిని బిగ్బాస్ కెప్టెన్ పోటీదారులుగా జంట లో ఉన్న సభ్యులు నిర్ణయించుకోవాలని ముగ్గురి జంటలకు.. తెలపటం జరిగింది. ఈ క్రమంలో మూడు జంటలు తీవ్రంగా చర్చించి వారిలో పోటీదారులను వారే సెలెక్ట్ చేసుకుని ఒక్కరు త్యాగం చేయడం జరిగింది. సన్నీ-మానస్‌, జంటలో సన్నీ నీ… కెప్టెన్సీ పోటీదారులుగా నిలబెట్టారు. హమీదా- శ్రీరామచంద్ర జంట లో.. శ్రీ రామ్ కెప్టెన్ తర్వాత పోస్టు ఏంటని హమీద ని ప్రశ్నిస్తాడు. ఈ క్రమంలో రేషన్ మేనేజర్ అని ఆన్సర్ ఇస్తది. అయితే తాను కెప్టెన్ అయితే నీకు రేషన్ మేనేజర్ పోస్ట్ ఇస్తా అని… హమీద కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. దానికి ఆమె ఓకే అంటది. ఇక చివరి జంట యానీ మాస్టర్‌- శ్వేత జంటలలో… శ్వేతా కెప్టెన్సీ పోటిదారులుగా నిలబడింది.

అయితే ఈ ముగ్గురు ఎవరికి వారు హౌస్ లో ఇంటి సభ్యుల మద్దతు కూడగట్టుకోవడానికి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. సన్నీ ప్రచారం చేస్తూ… దయచేసి నన్ను కెప్టెన్ చేయండి అంటూ ఇంటి సభ్యులను కోరతాడు. శ్వేతా… నేను గనుక కెప్టెన్ అయితే ఇంటిలో రూల్స్ చాలా స్ట్రీక్ట్ గా ఇంటి సభ్యులు ఫాలో అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చి.. ప్రచారం చేస్తూ ఉంటది. ఇక శ్రీరామ్ చంద్ర హౌస్ లో ప్రతి ప్రాబ్లం సాల్వ్ చేస్తానని, అంత మాత్రమే కాక కెప్టెన్ డ్రెస్ వేసుకున్న కాబట్టి తనకి సపోర్ట్ చేయాలని.. వేసుకున్న డ్రెస్ కి న్యాయం చేయాలని కోరతాడు. ఇంటిలో సభ్యులందరినీ సమానంగా చూస్తాం అని ఎక్కడా పక్షపాతంగా వ్యవహరించను అని.. శ్రీ రామ్ చంద్ర మాట ఇస్తాడు.

షణ్ముక్ సన్నీకి కత్తిపోటు

ఈ క్రమంలో కెప్టెన్సీ టాస్క్ కోసం నిలబడ్డ ముగ్గురికి “కత్తులతో సావాసం” అనే టాస్క్ బిగ్బాస్ ఇవ్వటం జరిగింది. ఈ టాస్క్ లో హౌస్మేట్స్ కెప్టెన్ కి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేదాన్ని తేల్చాలని .., ఎవరైతే అనర్హులు.. మీరు తేలుస్తారో.. వారికి కత్తి పోటు పొడవాలని.. ఇంటి సభ్యులకు బిగ్బాస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో ఇంటిలో ఉన్న సభ్యులు ఒక్కొక్కరు ముందుకు వస్తూ కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీలో నిలబడ్డ ముగ్గురిలో అనర్హుడు అనే వ్యక్తికి.. భారీగా కత్తిపోట్లు పొడిచారు. హౌస్ లో మొదటిగా వచ్చిన విశ్వ… సన్నీ వేసుకున్న బెల్ట్ కి కత్తి పోటు పొడవడం జరిగింది. ఆ తరువాత షణ్ముక్ … మన మధ్య అంత రాపో లేదంటూ.. సన్నీకి కత్తిపోటు పొడిచారు. అయితే ఈ రెండు తాను ఎక్స్పెక్ట్ చేశానని ఊహించాడు సన్నీ. ఇదే సమయంలో విశ్వ సానుభూతి సంపాదించుకోవాలని హౌస్లో ట్రై చేస్తున్నట్లు శ్రీరామ్ తో చెప్పుకొస్తాడు.

రవి సన్నీకి కత్తిపోటు

తర్వాత రంగంలోకి దిగిన సిరి… సన్నీకి కత్తిపోట్లు పొడవడం జరుగుద్ది. కత్తిపోటు పొడవాలని లేకపోయినా గాని.. తప్పదు అని.. సన్నీ ని కత్తితో పొడుస్తుంది. ఆ తర్వాత నీకు ఇంక కెప్టెన్ అయ్యే టైం.. అప్పుడే రాలేదు అంటూ లోబో.. పొడిచేసరికి సన్నీ ఒక్కసారిగా షాక్కు గురయి, లోబో.. పొడుస్తాడు అని నేను అస్సలు ఊహించలేదు అంటూ కొంతమంది తననే పడటంతో తట్టుకోలేక.. ఏడ్చేశాడు. భారీగా కంటతడి పెట్టుకోవడంతో పక్కనే ఉన్న మానస్.. వెంటనే వచ్చి సన్నీ నీ ఓదార్చడం జరిగింది. శ్వేతను; ప్రియ, నటరాజ్‌ మాస్టర్‌.. సన్నీని; యానీ మాస్టర్‌.. శ్రీరామ్‌ను కత్తితో పొడిచారు. కెప్టెన్‌గా నువ్వేదైనా చెప్తే జనాలు అంత సీరియస్‌గా తీసుకోలేరేమోనని రవి, త్వరగా ఆవేశపడతావంటూ ప్రియాంక సింగ్‌.. మరోసారి సన్నీకి కత్తిపోట్ల రుచి చూపించారు. అనంతరం సన్నీ యాంకర్ రవి దగ్గరకు వెళ్లి హౌస్లో ఏ కెప్టెన్ కూడా ఇప్పటివరకు సీరియస్ గా… కమాండింగ్ చేయలేదని కౌంటర్ ఇచ్చాడు.

మానస్ కి వార్నింగ్ ఇచ్చిన ప్రియాంక సింగ్

అయితే తర్వాత మళ్లీ ప్రక్రియ ప్రారంభం కాగా మానస్.. సన్నీని పొడిచే ప్రసక్తిలేదని మనసులోకి తలచుకొని మిగిలిన ఇద్దరిలో ఎవరు తనని ఇంప్రెస్ చేస్తారో వారిని పొడవనని.. తెలియజేస్తాడు. ఈ క్రమంలో శ్వేత అదేవిధంగా శ్రీరామచంద్ర ఎవరికివారు.. హౌస్ లో కెప్టెన్ అయితే అలా ఉంటాం ఈవిధంగా వ్యవహరిస్తాం… ఎవరికి వారు మళ్లీ హామీలు ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో మానస్… కంటెస్టెంట్ శ్వేతా ని కత్తితో పొడిచి శ్రీరామ్ కి.. సపోర్ట్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత రంగంలోకి దిగిన కాజల్ నిన్ను.. కసితీరా పొడవాలని అనుకున్నా అంటూ సన్నీ నీ ఉద్దేశించి… డైలాగులు వేయగా మధ్యలో.. ఫ్రెండ్షిప్ గుర్తొస్తుంది కాబట్టి నిన్ను బాధపెట్టాలని అంటూ శ్వేతా ని.. కత్తితో పొడవటం జరిగింది. తర్వాత రంగంలోకి దిగిన జెస్సీ.. సన్నీ శ్వేత ఇద్దరిలో ఒకరు కెప్టెన్ అవ్వాలని మనసులో తలచుకుని శ్రీరామ్ నీ.. కత్తితో పొడవడం జరిగింది. అయితే ఈ ప్రక్రియలో తక్కువ కత్తిపోట్లు శ్రీరామ్ కి.. పడటంతో హౌస్ లో నాలుగో కెప్టెన్ గా.. అయ్యాడు. అంతా అయిపోయిన తర్వాత సన్నీ… మానస్.. వ్యవహరించిన తీరు కి అయోమయానికి గురి అవుతాడు. శ్రీరామ్ నీ.. సపోర్ట్ చేయటం అర్థం కావడం లేదని ఈ విషయంలో క్లారిటీ తీసుకోవాలని సన్నీ ఆవేశపడటం జరుగుద్ది. ఈ క్రమంలో మానస్.. కెప్టెన్సీ చాన్స్ వదులుకోవటం పట్ల పింకీ ఫీలయ్యి మరో సారి ఎవరి కోసం త్యాగాలు చేయొద్దు అంటే అతడికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది.


Share

Related posts

బిగ్ బాస్ 4 : గంగవ్వ విశ్వరూపం..! కోపంతో ఆ కంటెస్టెంట్ చెంప చెళ్ళుమనిపించింది…?

arun kanna

SBI Alert: ఎస్బిఐ ఖాతాదారులకు అలర్ట్..!!

bharani jella

జగన్ ప్రభుత్వమే టార్గెట్ గా రెండు సెన్సేషనల్ పిటీషన్లు – హై కోర్టు లో స్ట్రాంగ్ వాదన??

CMR