Ram Charan: రామ్ చరణ్.. శంకర్ సినిమా షూటింగ్ గురించి క్లారిటీ ఇచ్చిన నిర్మాత దిల్ రాజు..!!

Share

Ram Charan: రామ్ చరణ్ కెరీర్లో 15వ చిత్రం సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చిత్రీకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని అతి భారీ బడ్జెట్ తో  నిర్మిస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాలో రామ్ చరణ్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నట్లు సమాచారం. రాజకీయ నేపథ్యంలో సినిమా తెరకెక్కించడానికి స్టోరీ ఆరీతిలో శంకర్ సెట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Ram Charan to team up with sensational Director Shankar!

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు గత కొన్ని రోజుల నుండి వైరల్ అవుతూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో నిర్మాత దిల్ రాజు.. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సెప్టెంబర్ మాసం నుండి స్టార్ట్ అవుతుందని తాజాగా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం సినిమాకి సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. సంగీత దర్శకుడిగా తమన్.. కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్, మాటల రచయితగా సాయిమాధవ్ బుర్రా నీ సినిమా యూనిట్ ఇటీవల ఎంపిక చేయడం జరిగింది.

Read More: RRR: RRRలో ఎన్టీఆర్ ముస్లిం గా మారటానికి కారణం అదేనట..!!

ఇక హీరోయిన్ విషయానికి వస్తే రష్మిక మందన నీ ఓకే చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు టాక్. మొత్తంమీద చూసుకుంటే ఆగస్టు కల్లా నటీనటులు సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకుని సెప్టెంబర్ మాసంలో షూటింగ్ స్టార్ట్ చేయాలని.. నిర్మాత దిల్ రాజు డిసైడ్ రావడం జరిగిందట.


Share

Related posts

Maa Elections: ‘మా’పై ప్రకాశ్ రాజ్ పెత్తనమా..? హిందూ సంఘాల ఆగ్రహం..!

Muraliak

వెళ్లలేరు…వెనక్కువెళ్లండి

somaraju sharma

WTC Final: ఫైనల్ కు ముందే భారత్ మీద పైచేయి సాధించిన న్యూజిలాండ్

arun kanna