Pooja hegde: పూజా హెగ్డేకి ప్రొడ్యూసర్ వార్నింగ్..నెమ్మదిగా అమ్మడిని సైడ్ చేసేస్తారా..?

Share

Pooja hegde: పూజా హెగ్డే మూడు భాషలలో ఇప్పుడు క్రేజీ హీరోయిన్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఏకంగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా సాగుతోంది. తెలుగులో ఆమె నటించిన ప్రభాస్ రాధే శ్యాం, అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రిలీజ్ కి సిద్దమవుతుండగా..ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబు – మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ అయింది. ఇక బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేస్తోంది.

producer gave warning to pooja-hegde
producer gave warning to pooja-hegde

ఒకటి సల్మాన్ ఖాన్ సినిమా కాగా మరొక సినిమా రణ్ వీర్ సింగ్ తో ఒక సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇలా తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డేకి కోలీవుడ్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం కూడా అందుకుంది. ఆ మూవీనే విజయ్ 65. ఇది పూజా హెగ్డే తమిళంలో రెండవ సినిమా. గతంలో ఓ తమిళ డెబ్యూ సినిమా చేసిన పూజా హెగ్డే ఆ తర్వాత మళ్ళీ కోలీవుడ్ నుంచి అవకాశాలు అందుకోలేకపోయింది. ఈమె తెలుగులో చేసిన సినిమాలు కెరీర్ ప్రారంభంలో పెద్ద సక్సెస్ సాధించలేదు.

Pooja hegde: పూజా హెగ్డేతో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతించాలని గట్టిగా చెప్పారట.

దాంతో ఇంతకాలం పూజా హెగ్డేకి తమిళ సినిమాలలో అవకాశాలు రాలేదు. అయితే ఇప్పుడు తెలుగు, హిందీ సినిమాలతో పూజా హెగ్డే లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. అందుకే ఏకంగా కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డేని ఎంచుకున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. అయితే పూజా హెగ్డే మీద ఓ తమిళ నిర్మాత సీరియస్ అవుతూ సూచనలు చేశాడట. మొన్నటి వరకు ఆమె షూటింగ్ కి హాజరైతే 2 అసిస్టెంట్స్ మాత్రమే వెంటపెట్టుకొని తెచ్చేదట. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు కాస్త 12 మంది అయ్యారట. ఇది నిర్మాతకి చాలా భారం అవుతుందని, ఇకపై ఆమెతో పాటు ఇద్దరిని మాత్రమే అనుమతించాలని గట్టిగా చెప్పారట.


Share

Related posts

విజయ్ దేవరకొండ ప్రైవేట్ పార్టీలో రష్మికకు ఏం పని?

sowmya

Corona : ఇదేం ద‌రిద్రం… క‌రోనా పెరుగుతుంటే ఇలాంటి రాజ‌కీయాలా?

sridhar

Today Horoscope డిసెంబర్ 16th బుధవారం రాశి ఫలాలు

siddhu