Suresh babu: 1000కి పైగా థియేటర్స్ ఉన్న అగ్ర నిర్మాత సురేష్ బాబు పాన్ ఇండియన్ సినిమాలు తీయకపోవడానికి కారణాలు ఇవేనా..?

Share

Suresh babu: టాలీవుడ్‌లో ఉన్న అగ్ర నిర్మాతలలో దగ్గుబాటి సురేష్ బాబు ఒకరు. నిర్మాతగా సురేష్ బాబు కథ విని హీరో ఎవరైతే సూటవుతారో జడ్జ్ చేసి చెప్పేస్తారు. అంతేకాదు క్యారెక్టర్ విని నటుడిని, సీన్ విని లొకేషన్‌ని ఫైనల్ చేసేంత నాలెడ్జ్ ఉన్న నిర్మాత. అందుకే ఏ కథను స్టూడియోలో తెరకెక్కించాలో ఏ కథను బయట లొకేషన్స్‌లో చేయాలో చెప్పగల సమర్ధుడు. నిర్మాతగా సురేష్ బాబు ఎన్ని ప్రయోగాలు చేసిన  లిమిటెడ్ బడ్జెట్‌లోనే నిర్మిస్తారు. ఆయన నిర్మించే సినిమాల బడ్జెట్ పరిధి దాటిన దాఖలాలు చాలా తక్కువ.

producer suresh-babu has more than 1000 theaters
producer suresh-babu has more than 1000 theaters

ఇది ఆయన తండ్రి లెజండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గారి వద్ద నుంచి వచ్చిన క్వాలిటి. రామానాయుడు గారు కూడా ఎంత పెద్ద హీరోతో సినిమా తీసినా ఎప్పుడు బడ్జెట్ పరిధిలోనే ఉండేలా జాగ్రత్తపడతారు. అందుకు కారణం నాయుడు గారు నిర్మాతగా సినిమాలు ప్రారంభించిన రోజుల్లోనే ఓ సినిమా బడ్జెట్ లిమిట్ దాటితే ఎన్ని నష్టాలు వస్తాయో, దానివల్ల కెరీర్ ఎంతగా దెబ్బతింటుందో స్వీయ అనుభవంతో తెలుసుకున్నారు. అందుకే స్టార్ హీరో – స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ అయినా ఆ కథకి ఎంత బడ్జెట్ అవసరం ఉంటే అంతే పెట్టేవారు.

Suresh babu: అదే ఆ తర్వాత సురేష్ బాబు పాటిస్తూ వస్తున్నారు.

అదే ఆ తర్వాత సురేష్ బాబు పాటిస్తూ వస్తున్నారు. అందుకే ఆయన నిర్మిస్తున్న సినిమాలు ఓ రేంజ్ బడ్జెట్‌లోనే ఉంటున్నాయి. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా మార్కెట్ పరిధి బాగా పెరిగింది. కథ కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయిన్టైన్ చేస్తున్నారు. కథకి తగ్గట్టు హీరో..అందుకు తగ్గట్టు ఇతర నటీ నటులు..దీనికంతటికీ తగ్గట్టు బడ్జెట్ కేటాయించాల్సి వస్తోంది. అయితే ఇక్కడ సినిమాను తెరకెక్కించే దర్శకుడితో పాటు మార్కెట్ ఉన్న హీరో మీదే బిజినెస్ ఆధారపడి ఉంటుంది. దానిమీదే లాభ నష్టాల లెక్కలు ఉంటాయి.

ఇండస్ట్రీలో అందరు నిర్మాతలు పాన్ ఇండియన్ సినిమాలను నిర్మిస్తున్నారు. కానీ సురేష్ బాబు, వెంకటేష్, రానా లాంటి స్టార్స్ ఉన్నా కూడా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించడానికి ఆలోచిస్తున్నారు. అందుకు కారణం ప్రస్తుతం కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులే. గుణశేఖర్ దర్శకత్వంలో రానా ప్రధాన పాత్రలో హిరణ్య కశిప అనే సినిమాను మొదలు పెట్టారు. ఈ సినిమా బడ్జెట్ 120 కోట్లని అంచనా వేసుకున్నారు. ప్రీప్రొడక్షన్స్ వర్క్ కోసం దాదాపు 10 కోట్లు కూడా ఖర్చు చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

Suresh babu: ఏదైనా తేడా జరిగితే కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుంది.

1000 కిపైగా సొంత థియోటర్స్ ఉన్న సురేష్ బాబు ఎందుకు భారీ బడ్జెట్ పెట్టి పాన్ ఇండియన్ సినిమాలు నిర్మించడం లేదనేది గతకొన్ని రోజులుగా హాట్ టాపిక్. అందుకు కారణం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాపారం ఎంతవరకు జరుగుతుందనేది ఖచ్చితంగా ఓ అంచనాకి రాలేకపోవడమే. ఒకవేళ కథ, దర్శకుడు, హీరోను బట్టి బిజినెస్ జరిగినా అన్నీ బాహుబలి సినిమాలలా లాభాలు వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఏదైనా తేడా జరిగితే కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుంది. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. ఇవన్నీ దృష్ఠిలో పెట్టుకొనే నిర్మాత సురేష్ బాబు పాన్ ఇండియన్ సినిమాలను నిర్మించడానికి సిద్దమవడం లేదని అంటున్నారు.


Share

Related posts

విజయ్ సాయి రెడ్డి – జగన్ ల మధ్య రాజుగారు కొత్త చిచ్చు??

CMR

ప్రభాస్ ప్రాజెక్ట్స్ లో అనుష్క ఎందుకు నటించడం లేదో ..?

GRK

నాగబాబు అంత ఎమోషనల్ అవ్వడం ఇదే మొదటి సారి.. నీహారిక చేసిన పనికి!

Teja