టాలీవుడ్ రౌడీ హీరోగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ నటించగా సంచలన విజయాన్ని అందుకున్న సినిమా అర్జున్ రెడ్డి. యంగ్ బ్యూటి శాలినీ పాండే సినిమాతో టాలీవుడ్ కి ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ కి ముందు ఎన్నో వివాదాలు తలెత్తినప్పటికి అర్జున్ రెడ్డి రిలీజయ్యాక మాత్రం ఓవర్ నైట్ క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఈ సినిమా లో హాట్ సీన్స్ కి లిప్ లాక్స్ కి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఆ తర్వాతే శాలినీ పాండే కెరీర్ అనుకున్నదాని కంటే భిన్నంగా సాగుతూ వస్తోంది.
కీర్తి సురేష్ నటించిన మహానటి, రాజ్ తరుణ్ తో ఇద్దరిలోకం ఒకటే, కళ్యాణ్ రాం తో 118, అలాగే పాన్ ఇండియన్ సినిమాగా వచ్చిన నిశ్శబ్ధం. కానీ ఈ సినిమాలలో శాలినీ పాండే కి కళ్యాణ్ రాం తో చేసిన ఒక్క 118 మాత్రమే హిట్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి సినిమాతో వచ్చిన క్రేజ్ కి టాలీవుడ్ లో తిరుగుండదని అనుకుంటే సినిమా అవకాశాలు అందుకోవడంలో వెనకపడింది. ఇనాళ్ళు శాలీనీ చేసిన సినిమాలు గనక కొన్ని అయినా హిట్ అయి ఉంటే తన కెరీర్ ఇంకోలా ఉండేది.
అయితే ఇప్పుడు శాలీనీ పాండే కి టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో మంచి ఛాన్స్ దక్కించుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ప్రముఖ నిర్మాణ సంస్థలో నటించేందుకు 3 సినిమాలు సైన్ చేసింది. ఇందులో భాగంగానే ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ఫొటో షూట్ కూడా పాల్గొంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో రూపొందబోతున్న ఈ సినిమా కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. ఇదే సంస్థలో మరో రెండు సినిమాలు చేయబోతోంది.