Project K : టాలీవుడ్ డార్లింగ్ స్టార్ ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్‌లను షురూ చేస్తూ మంచి ఫామ్ లో వున్నాడు. ఈ క్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా మన ప్రభ కమిట్ అయ్యాడనే విషయం తెలిసినదే కదా. ప్రస్తుతం ఈ ఫ్యూచరిస్టిక్ మూవీ సిట్టింగ్ తో ప్రభాస్ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె నటించనున్నారు. దీనికి నాగ్ ‘ప్రాజెక్ట్ కే’ అని టెంపరరీ నామకరణం చేసాడు. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ మెగా బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం మేకర్స్ రంగం షురూ చేసారని తెలుస్తోంది. కాగా ఈ సినిమా షెడ్యూల్ ఫిబ్రవరి 2వ వారంలో హైదరాబాద్‌లో ప్రారంభమై దాదాపు 10 రోజుల పాటు కొనసాగనుంది. ప్రభాస్, దీపికా పదుకొణెలు ఈ లాంగ్ షెడ్యూల్ లో పార్టిసిపేట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్లో పలు కీలక ఘట్టాలు చిత్రీకరించనున్నారు మేకర్స్. తరువాతి షెడ్యూల్లో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ జాయిన్ అవ్వనున్నారు.
ఇకపోతే, ఈ సినిమా విడుదలను ముందే ప్రకటించేసారు మేకర్స్. ఎట్టి పరిస్థితులలో ఈ సినిమా ఏప్రిల్ 2023లో విడుదల కాబోతోందని తెలిపారు. ఈ హై-ఆన్ VFX చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తుండగా, డాని శాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేయనున్నారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఆ రెండో సంగీత దర్శకుడు ఎవరో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…
Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…