PSPK28 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నారు.. ఆ సినిమా తర్వాత క్రిష్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేయనున్నారు.. క్రిష్ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 28 సినిమా చేయనున్నారు.. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న PSPK28 సినిమా లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది..
హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయి ని యూనిట్ ఫిక్స్ చేసింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. పవర్ స్టార్ నటించిన తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి , జల్సా సినిమాలకు ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశాడు.ఈ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి “ఇప్పుడే మొదలైంది” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. హరీష్ శంకర్ గతంలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో చూపించారు. ఇప్పుడు ఐబి ఆఫీసర్గా చూపించనున్నాడని టాక్ . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను కూడా సిద్ధం చేశారట హరీష్.