ప‌బ్‌జి మొబైల్ ప్రియుల‌కు షాక్‌.. ఇక పూర్తిస్థాయిలో గేమ్ నిలిపివేత‌…

చైనాతో నెల‌కొన్న స‌రిహ‌ద్దు వివాదం కార‌ణంగా భార‌త్ మొద‌ట‌గా టిక్‌టాక్ స‌హా అనేక చైనా యాప్‌ల‌ను నిషేధించింది. అయితే కొన్ని రోజుల‌కు ప‌బ్‌జి మొబైల్ గేమ్‌తోపాటు మ‌రికొన్ని యాప్‌ల‌ను కూడా నిషేధించారు. ఈ క్ర‌మంలో ప‌బ్‌జి మొబైల్ గేమ్‌ను గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి తొల‌గించారు. అయిన‌ప్ప‌టికీ అప్ప‌టికే డివైస్‌ల‌లో గేమ్ ఇన్‌స్టాల్ అయి ఉన్న‌వారు ఇప్ప‌టి వ‌ర‌కు గేమ్ ఆడారు. అయితే ఇక‌పై గేమ్ సేవ‌ల‌ను పూర్తిగా నిలిపివేస్తున్న‌ట్లు ప‌బ్‌జి యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ప‌బ్‌జి ఇండియా ఫేస్‌బుక్ లో వార్త‌ను పోస్ట్ చేసింది.

pubg completely stopped working in india

ప‌బ్ జి గేమ్‌ను భార‌త్‌లో పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నామ‌ని, గేమ్ సేవ‌లు ఇక యూజ‌ర్ల‌కు ల‌భ్యం కావ‌ని, స‌ర్వ‌ర్ల‌ను కూడా నిలిపివేస్తున్నామ‌ని ప‌బ్‌జి ఇండియా ప్ర‌క‌టించింది. శుక్ర‌వారం నుంచి గేమ్ ఇక శాశ్వ‌తంగా అందుబాటులో ఉండ‌ద‌ని తెలిపింది. అయితే టెన్సెంట్ గేమ్స్‌తో పార్ట్‌న‌ర్‌షిప్‌ను వ‌దులుకున్న‌ప్ప‌టికీ ప‌బ్‌జి మొబైల్‌కు క‌ష్టాలు త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలోనే ఆ సంస్థ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

అయితే భ‌విష్య‌త్తులో ఇండియాలో మ‌ళ్లీ గేమ్‌ను అందుబాటులోకి తెస్తామ‌ని ప‌బ్‌జి కార్ప్ ఆశాభావం వ్య‌క్తం చేసింది. ఇప్ప‌టికైతే పూర్తి స్థాయిలో సేవ‌ల‌ను నిలిపివేస్తున్నామ‌ని, కానీ భ‌విష్య‌త్తులో త‌మ‌కు ప‌బ్లిషింగ్ పార్ట్‌న‌ర్ దొరికితే మ‌ళ్లీ గేమ్‌ను ఇండియాలో అందుబాటులోకి తెస్తామ‌ని వెల్ల‌డించింది.

ఇక మ‌రోవైపు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఇప్ప‌టికే ఫౌ-జి పేరిట మేడిన్ ఇండియా గేమ్‌ను లాంచ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే గేమ్‌ను ఇప్ప‌టికే డెవ‌ల‌ప్ చేస్తున్నారు. ఆ ప్ర‌క్రియ దాదాపుగా పూర్తి కావ‌చ్చింది. ఇటీవ‌లే ఆ గేమ్‌కు చెందిన టీజ‌ర్‌ను లాంచ్ చేశారు. న‌వంబ‌ర్ నెల‌లో ఫౌ-జి గేమ్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.