193 పరుగుల వద్ద ముగిసిన పుజారా ఇన్నింగ్స్

సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో పుజారా మారథాన్ ఇన్నింగ్స్ 193 పరుగుల వద్ద ముగిసింది. 373 బంతులు ఆడిన పుజారా 22 ఫోర్లతో 193 పరుగులు చేసి లయన్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కేవలం 7 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. మరో వైపు రిషభ్ పంత్ ధాటిగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

లంచ్ విరామ సమయానికి 389/5 తో ఉన్న భారత్ లంచ్ విరామం తరువాత కొద్ది సేపటికే పుజారా వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 429 పరుగులు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా సిడ్నీలో జరుగుతున్న చివరి టెస్ట్ లో భారత్ పట్టు బిగించింది. ఇప్పటికే సిరీస్ లో2-1 ఆధిక్యతతో ఉన్న టీమ్ ఇండియా తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ కైవసం చేసుకునే అవకాశాలను సృష్టించుకుంది. బ్యాటింగ్ కు,బౌలింగ్ కు సమానంగా అనుకూలించే సిడ్నీ పిచ్ పై మూడో రోజు నుంచి ఇ  బంతి స్పిన్ అవుతుందన్న అంచానాల నేపథ్యంలో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ గెలవడం కష్టమేనని కామెంటేటర్స్ చెబుతున్నారు.