PUNEETH RAJ KUMAR: ఆ కోరిక నెరవేరకుండానే పునీత్ రాజ్‌కుమార్ చనిపోయారు..

Share

PUNEETH RAJ KUMAR: అప్పు, యువరత్న అని ముద్దుగా పిలుచుకునే కన్నడ సూపర్ స్టార్ (SUPER STAR) పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణాన్ని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. బతికినన్నాళ్లు నిజాయితీ, నిండుతనంతో ఇతరులకు సహాయ పడ్డ పునీత్‌ ఇక లేరని తలుచుకొని చాలామంది కృంగిపోతున్నారు. టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు కూడా పునీత్‌తో తాము గడిపిన క్షణాలు గురించి గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా తెలుగు సినీ దర్శకుడు మెహర్ రమేష్ కూడా పునీత్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అతని సినిమాతోనే తన కెరీర్ ప్రారంభమైందని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే చిరకాల కోరిక తీరకుండానే పునీత్ కన్నుమూశారని వెల్లడించారు.


Rice: అన్నం లో ఈ పదార్ధాలు కలిపి నైవేద్యం గా పెట్టడం వలన మీకు ఉన్న ఈ సమస్యలకు చక్కని పరిష్కారం దొరుకుతుంది!!
పునీత్ చిరకాల కోరిక ఇదే: మెహర్ రమేష్

“చిరు హీరోగా భోళాశంకర్ సినిమా ప్రకటించిన తర్వాత పునీత్ నాకు ఫోన్ చేసి అభినందించారు. ఈ సినిమాకి నేను దర్శకుడిగా వ్యవహరిస్తున్నారని తెలిసి అతను సంతోషించారు. ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి ఓ డ్యాన్స్ బిట్‌లో నటించడానికి తనకు ఛాన్స్ ఇవ్వాలని పునీత్ నన్ను కోరారు. లేదా కనీసం చిన్న పాత్ర అయినా ఇవ్వమని అడిగారు.” అని మెహర్ రమేష్ అన్నారు.

BREAKING: కన్నడ సినిమా హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం..
పునీత్ రాజ్ కుమార్ (PUNEETH RAJ KUMAR) హీరోగా నటించిన వీర కన్నడిగా(2004) చిత్రానికి మోహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఇదే సినిమాని తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా పేరుతో పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. ఈ రెండు భాషా చిత్రాలు ఒకేసారి షూటింగ్ జరుపుకొని ఒకేసారి విడుదలయ్యాయి.

పునీత్‌కు అంతిమ నివాళి అర్పించడానికి తరలివస్తోన్న లక్షల మంది

పునీత తన ఫైనల్ కోరికను నెరవేర్చుకోకుండానే అతి చిన్న వయసులో మరణించడంతో చాలామంది విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం నాడు ప్రభుత్వ లాంఛనాల మధ్య అతని భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కర్నాటక ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం కంఠీరవ స్టేడియంలో పునీత్‌కు అంతిమ నివాళి అర్పించడానికి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. అతని మంచితనమే ఈ స్థాయిలో అభిమానాన్ని సంపాదించుకుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

EX MP Chinta Mohan: ‘చింతా’ ఏమిటి ఆ నేతలను అంత మాట అనేశారు…!!


Share

Related posts

ప్రభాస్ పిచ్చ క్లారిటీతో ఉంటే వీళ్ళెందుకు అనసవరంగా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు ..?

GRK

Bigg boss Noel : బిగ్ బాస్ నోయెల్ కొత్త రాప్ సాంగ్ ప్రోమో అదిరిపోయింది

Varun G

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ఏడాది పాలన ఎలా ఉంది ?- ప్రజాభిప్రాయ సేకరణ

ramu T