Puneeth: పునీత్ రాజ్‌కుమార్ లవ్‌స్టోరీలో కన్నీళ్లు పెట్టించే సన్నివేశం ఇదే !

Share

Puneeth Rajkumar: సెలబ్రిటీ కుటుంబాల్లో పెళ్లిళ్లు, విడాకులు సర్వ సాధారణమే. విడాకులకు వీలైంత దూరంగా ఉండాలంటే.. పెద్ద కుటుంబాలకు కోడలిగా వెళ్లిన యువతలు ఎంతో ఓపికగా అణుకువగా ఉండాల్సి ఉంటుంది. అంతటి ఓపిక కన్నడ హీరో పునీత్ రాజకుమార్(Puneeth Rajkumar) సతీమణి అశ్విని రేవనాథ్(Ashwini Revanth ) సొంతం. తెలుగులో ఎన్టీఆర్.. తమిళంలో ఎంజీఆర్.. ఎలా గొప్ప పేరు తెచ్చుకున్నారో.. అలా కన్నడలో కంఠీరవ రాజ్‌కుమార్ పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఓ పెద్ద కుటుంబంలోకి చిన్న కుటుంబానికి చెందిన అశ్విని కోడలిగా అడుగుపెట్టింది. పునీత్ బతికున్నంత వరకు అతనితోనే కలిసివుంది. పునీత్‌తో కలిసి ధృతి(Drithi), వందిత(Vandhitha) అనే ఇద్దరు పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది.

పునీత్-అశ్విని లవ్‌స్టోరీ

పునీత్, అశ్విని తొలిసారిగా పరిచయమయ్యేనాటికి వారి వయసు చాలా చిన్న. అప్పట్లో పునీత్‌కు దాదాపు 23 ఏళ్లు ఉంటే.. ఆమెకు జస్ట్ 21 ఏళ్లే. మొదటిచూపులోనే పునీత్ ఆమెకు ఆకర్షితులయ్యారు. ఆమె ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా అతనికి పరిచయం అయ్యింది. ఆ తరువాత చాలాసార్లు వీరిద్దరూ అనుకోకుండా కలుసుకున్నారు. అందరూ పునీత్‌ను ఒక సినిమా సినీ సెలబ్రిటీగా చూస్తే.. అశ్విని మాత్రం సాధారణ లోహిత్(Lohith Rajkumar) గానే ట్రీట్ చేసేది. ఆమెకు సినిమాల మీద ఆసక్తి కూడా ఉండకపోయేది కాదు.

అయితే 8 నెలల పాటు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమెని పెళ్లి చేసుకోవాలని పునీత్‌ డిసైడ్ అయిపోయారు. అశ్విని కూడా పునీత్‌ను ఇష్టపడింది. తన ప్రేమ వ్యవహారం గురించి పునీత్‌ ధైర్యం చేసి తన తండ్రికి చెప్పగా అందుకు ఆయన ఓకే అన్నారు. 30 మందితో కూడిన పెద్ద కుటుంబం కావడంతో కుటుంబ పెద్దలందరి అంగీకారం తీసుకునేసరికి కొద్ది నెలల సమయం పట్టింది. మరోపక్క అశ్విని తల్లిదండ్రులు కూడా చాలా భయపడి పోయారు. అంత పెద్ద కుటుంబంలోకి తమ చిన్న కుటుంబం నుంచి ఆడబిడ్డ వెళితే భవిష్యత్తులో ఏమవుతుందోనని భయపడ్డారు. ఆ తర్వాత పునీత్ మంచితనాన్ని చూసి తమ బిడ్డను ఇచ్చి పెళ్లి చేశారు.

లవ్‌స్టోరీలో కన్నీళ్లు పెట్టించే సన్నివేశం ఇదే!

పెళ్లైన డిసెంబర్ 1, 1999 నుంచి వీరిద్దరి అన్యోన్యంగా జీవించారు. సెలబ్రిటీ హోదా నుంచి పూర్తిగా దూరంగా ఉన్న అశ్విని తన కుటుంబమే ప్రపంచంగా జీవించింది. ముఖ్యంగా పునీత్‌యే లోకంగా సంతోషంగా జీవితాన్ని సాగించింది. 30 మందితో కూడిన ఉమ్మడి కుటుంబంలో ఎంతో అణుకువగా ఒదిగిపోయింది. కానీ కేవలం 22 సంవత్సరాల్లోనే విధి పునీత్‌ను తన నుంచి దూరం చేసింది. పునీత్‌ కన్నుమూసిన సమయంలో ఆమె దుఃఖించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఆమె లవ్‌స్టోరీ, పెళ్లి బంధంలో ఈ కన్నీళ్లు పెట్టించే సన్నివేశం చూస్తామని బహుశా బంధు మిత్రులెవరూ అనుకోని ఉండరు.


Share

Related posts

గంటా రావడం కోసం జగన్ స్టాంగ్ మార్గం నిర్మించారు !అంత లవ్వు ఏంటి?

Yandamuri

BJP: త్వరలో బీజేపీలో చేరనున్న ఈ మాజీ క్రికెటర్..! పోటీ చేసే నియోజకవర్గం ఫిక్స్..?

somaraju sharma

పవన్ కళ్యాణ్ ని చెడుగుడు ఆడుకున్న తమిళ్ మీడియా..!!

sekhar