NewsOrbit
జాతీయం న్యూస్

పూణే లో చాందినీ చౌక్ పాత వంతెనను ఇలా కూల్చేశారు..వీడియో వైరల్

మహారాష్ట్రలోని పూణే చాందినీ చౌక్ పాత వంతెనను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూల్చివేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నోయిడా ట్విన్ టవర్లు కూల్చేసిన ముంబై సంస్థ ఎడిఎఫ్ ఇంజనీరింగ్ సంస్థనే ఈ చాందినీ చౌక్ వంతెనను నేలమట్టం చేసింది. ముంబై – బెంగళూరు జాతీయ రహదారిపై పుణే లో ఉన్న ఈ వంతెన అత్యంత కీలకమైంది. అయితే దీన్ని బ్రిటీష్ కాలంలో అప్పటి అవసరాల మేరకు నిర్మించారు. జాతీయ రహదారి విస్తరించినప్పటికీ బ్రిడ్జ్ ని వెడల్పు చేయకపోవడంతో ఈ వంతెన వద్ద నిత్యం ట్రాఫిక్ స్తంబిస్తొంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ .. చాందినీ చౌక్ వంతెనను కూల్చి వేసి దాని స్థానంలో మల్టీ బ్రిడ్జ్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

Chandni Chowk bridge

 

ఈ క్రమంలో ఈ వంతెన కూల్చివేత ప్రక్రియ బాధ్యతలను ఇటీవల దేశంలో అత్యంత ఎత్తైన ట్విన్ టవర్లుగా ఖ్యాతికెక్కిన నోయిడా జంట టవర్లను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో 9 సెకన్లలలో నేలమట్టం చేసిన ఎడిఎఫ్ ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత శక్తివంతమైన పేలుడు పదార్ధాలు ఉపయోగించి ఈ వంతెనను కూల్చి వేసింది. రద్దీగా ఉండే చాందినీ చౌక్ ప్రాంతంలో ఉన్న ఈ బ్రిడ్జ్ ని గత అర్ధరాత్రి దాటిన తర్వాత సురక్షితంగా కూల్చివేసినట్లు కలెక్టర్ రాజేశ్ దేశ్ ముఖ్ తెలిపారు.

Chandni Chowk bridge

చాందినీ చౌక్ బ్రిడ్జ్ కూల్చివేతను ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిండే స్వయంగా పర్యవేక్షించారు. వంతెన కూల్చివేతకు ముందు ఆ ప్రదేశంలో సుమారు 8 గంటల పాటు వాహనాల రాకపోకలను నిలిపివేసి వేరే మార్గంలో ట్రాఫిక్ ను మళ్లించారు. ట్విన్ టవర్ల కూల్చివేతకు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానంతోనే చార్జింగ్ విధానంలో బ్రిడ్జ్ కి పేలుడు పదార్ధాలు అమర్చి ఆపై దాన్ని పేల్చారు. దీంతో పెద్ద శబ్దంతో కుప్పకూలింది. ఈ వంతెన కూల్చి వేతకు 6 సెకన్ల సమయం మాత్రమే పట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

 

Chandni Chowk bridge

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?