న్యూస్

హనీసింగ్ ‘మఖ్నా’ బూతట!

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ప్రఖ్యాత రాపర్ యోయో హనీసింగ్‌పై పంజాబ్ మహిళా కమిషన్ దృష్టి పడింది. హనీసింగ్ రూపొందించిన ఇటీవలి ఒక పాటలో మహిళల పట్ల అసభ్యమైన మాటలు వాడినట్లు కమిషన్ చేల్చింది. ఈ విషయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషన్ ఛైర్‌పర్సన్ మనీషా గులాటీ పోలీసులను కోరారు.

ఆరు నెలల క్రితం యోయో హనీసింగ్ మఖ్నా అనే పాట రికార్డు చేశాడు. యుట్యూబ్‌లో ఇంతవరకూ ఆ పాటను 20 కోట్ల 90 లక్షల మంది వీక్షించారు. పాటలో అసభ్యకరమైన మాటలు ఉన్నాయని గుర్తించిన మనీషా గులాటీ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికీ, పోలీసు డైరక్టర్ జనరల్‌కూ ఫిర్యాదు చేశారు.

వెంటనే హనీసింగ్‌పై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఆమె కోరారు. ఈ నెల 12 వ తేదీ లోగా ఈ విషయంలో ఏం జరిగిందీ తనకు వివరించాలని ఆమె కోరారు. మఖ్నా పాటను పంజాబ్‌లో నిషేధించాలని ఆమె కోరారు.

మహిళా కమిషన్ ఫిర్యాదును ఎదుర్కొంటున్న మఖ్నా  పాట వీడియో:


Share

Related posts

యాదాద్రి లడ్డూలో బొద్దింక!

Mahesh

BREAKING: ఐపిఎల్ కి కరోనా టెన్షన్.. ఒకరికి వచ్చేసింది ..!

amrutha

Onions: ఉల్లి తొక్కల ఉపయోగాలు తెలిస్తే అసలు పడేయరు !!

siddhu

Leave a Comment