NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ స‌ర్కారుపై చిన్న‌మ్మ క‌న్నెర్ర‌….

రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు.

బీజేపీ రాష్ట్ర నేత‌ల ఆందోళ‌న పిలుపు నేప‌థ్యంలో ప్ర‌కాశం జిల్లాలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి గారు మాట్లాడుతూతూర్పుగోదావరి జిల్లా అంతర్వేది గ్రామంలో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథం దగ్ధం సంఘటనతో సహా రాష్ట్రంలో గత సంవత్సర కాలంగా దేవాలయాలపై దాడులు జరిగిన అన్ని సంఘటనలపైనా CBI విచారణ చేయ‌డ‌మే స‌రైన‌ద‌ని అన్నారు.

డౌట్ ప‌డ‌కుండా ఉండ‌లేర‌ట‌

అంతర్వేది గ్రామంలో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి రథం దగ్ధం సంఘటన యావత్ రాష్ట్రంలోని హిందూ ప్రజల హృదయాలను దారుణంగా గాయపరిచిందనీ పురంధేశ్వ‌రి తెలిపారు. ఈ సంఘటన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరు భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరచాయని స్పష్టం చేశారు. హిందూ దేవాలయ వ్యవస్థలను పతనం చేయాలన్న రీతిలో సాగుతున్న చర్యలు హిందూ భక్తులను మరింత కలవరపెడుతున్నాయని వాపోయారు. హిందూ దేవాలయ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారుల మాటలు, చేతలు వారి చిత్తశుద్ధిపై సందేహాలు కలిగించక తప్పదని అన్నారు. రాష్ట్రంలోని ఆలయాలకు రక్షణ కొరవడుతోందన్న భావం హిందూ భక్తులలో రోజురోజుకూ పెరుగుతోందని మండిపడ్డారు.

ప్ర‌భుత్వం ఏం చేస్తోంది?

గతంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో విగ్రహాల విధ్వంసం, నెల్లూరు జిల్లా బిట్రగుంట శ్రీ వేంకటేశ్వర స్వామి వారి యొక్క రథం తగలబెట్టడం, పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో అమ్మవారి దేవాలయ ప్రవేశ ద్వారం ధ్వంసం చేయడం లాంటి అనేక సంఘటనలలో ఎవ్వరినీ శిక్షించకుండా ఈ పనులన్నీ పిచ్చివాళ్ళ చేష్టలుగా చూపించే ప్రయత్నం చేయడం ఇటువంటి సంఘటనలు పెరగడానికి దోహదపడ్డాయని పురంధేశ్వ‌రి మండిప‌డ్డారు. హిందూ దేవాలయాల, ఆస్తుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం ఇటువంటి సంఘటనలకు కారణమన్నది నిర్వివాదాంశం అని అన్నారు.

తీవ్రంగా వ్యతిరేకిస్తున్నార‌ట‌

రాష్ట్ర ప్రభుత్వ ధోరణి పోలీసులను , అధికారులను ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చిన్న చిన్న సంఘటనలుగా , పిచ్చి వాళ్ళ , ఆకతాయిల పనులుగా చిత్రీకరించేలా ప్రేరిపిస్తున్నాయని పురంధేశ్వ‌రి స్పష్టం చేశారు . హిందూ దేవాలయ ఆస్తులను, భూములను స్వాధీనం చేసుకోవడం, అన్యాక్రాంతం కావడం దారుణ‌మ‌ని అన్నారు. అన్నీ తెలిసినా దేవాదాయ శాఖ అధికారులు మరియు ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని దేవాలయ భూములు వేల ఎకరాలు అన్యాక్రాంతం గురవుతున్నాయని మండిపడ్డారు. అంతర్వేది రథం దగ్ధం సంఘటనతో సహా గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరిగిన అన్ని సంఘటనలపైనా CBI విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించడానికి వెళ్ళిన హిందువులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పురంధేశ్వ‌రి అన్నారు. మనోభావాలు గాయపడ్డ భక్తుల శాంతియుత నిరసనలను అడ్డగించడానికి వివిధ స్థలాలలో ఆటంకాలు ఏర్పరచడం ,ప్రశ్నించే వాళ్లను అణిచి వేయాలని ప్రయత్నం చేయడం వంటి చర్యలు రాష్ట ప్రభుత్వ హిందువులను అణచివేసినట్లుగా భావిస్తున్నామనీ అన్నారు .హిందూ భక్తులపై అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకుని రథం దగ్ధం కావడానికి కారణమైన దోషులను శిక్షించవలసినదిగా డిమాండ్ చేశారు.

author avatar
sridhar

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N