Romantic movie Review : పూరి జగన్నాధ్ తనయుడు ‘రొమాంటిక్’ సినిమాతో హిట్ అందుకున్నాడా..?

Share

Romantic movie Review :

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. తన కొడుకును మంచి స్టార్ చేసేందుకు తీవ్రంగా శ్రమించాడు. తాజాగా పూరి కొడుకు ఆకాశ్ పూరి హీరోగా కేతిక శర్మ హీరోయిన్‌గా “రొమాంటిక్” సినిమా నేడు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు కథనం, మాటలు, స్క్రీన్ – ప్లేను స్వయంగా పూరి అందించారు. ఇక బహుబలి తర్వాత తన స్టామినా, నటన స్థాయిని మరింత పెంచుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించారు. రొమాంటిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో విజయ్ దేవరకొండ వచ్చి అభిమానులను పలకరించడం, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలోని నటీనటులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా మాంచి క్రేజ్ తెచ్చారు. ఓ వైపు ట్రైలర్ యువతని ఆకట్టుకుంటే.., మరోవైపు ప్రీ రిలీజ్ ప్రమోషన్ కూడా బాగా కలిసొచ్చింది.
నేరుగా ప్రభాస్ స్థాయి హీరో ఆకాశ్ పూరి, కేతిక శర్మలను పలు ప్రశ్నలు అడిగి, ఆ తర్వాత మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా ఉంది..!? పూరీ కల ఫలించిందా..!? కేతిక అందాల వడ్డనకు ఫిదా అయ్యారా..!? అనేది చూద్దాం..


Romantic : ‘రొమాంటిక్’ రిలీజ్ చేయమంటూ పూరిని అడుగుతున్న ఫ్యాన్స్..

రొమాంటిక్ స్టోరీ ఎంటీ..

రొమాంటిక్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. రొమాంటిక్ సినిమాను పూరి శిష్యుడు అయిన అనిల్ పాదూరి డైరెక్ట్ చేశారు. ఒక మాఫియా బ్యాక్ గ్రౌండ్ టచ్‌తో, రొమాన్క్ నిండిన ప్రేమ కథ ఇది. ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఎంటంటే ఈరోజుల్లో అందరూ మోహాన్నే ప్రేమ అనుకుంటున్నారు. అసలు ఏది ప్రేమ, ఏది మోహం.. ఈ రెండింటిలో ఉన్న తేడాను ఈ మూవీలో చూపించే ప్ర‌య‌త్నం చేశారు. కథలో మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు.. ఓ సారి రొమాంటిక్ మరోసారి ఎమోషనల్.. ఆ వెంటనే యాక్షన్ సీన్లతో సినిమా నిండింది. ఇకపోతే ఆకాష్ పూరి, కేతిక శర్మలు నటనా పరంగా పర్వాలేదనిపించారు. రమ్యకృష్ణ కూడా ఆకాశ్ పూరికి అత్త పాత్రతో పాటు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఇరగదీశారు. ఇక ఈ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు.


Romantic : ‘రొమాంటిక్’ డైలమా నిజమేనా ..?

Romantic movie Review : పూరి జగన్నాధ్ తనయుడు ‘రొమాంటిక్’ సినిమాతో హిట్ అందుకున్నాడా..?

యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్..

ఆకాశ్ పూరి, కేతికశర్మ మధ్య వచ్చే లవ్ కమ్ రొమాన్స్ సన్నివేశాలు ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకున్నాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సినిమా పేరే రొమాంటిక్ కాబట్టి.. దర్శకుడు కూడా ఇందులో ఎక్కువగా రొమాన్స్ పండించాలని డిసైడ్ అయిపోయాడు. అనుకున్నట్టు గానే హీరో, హీరోయిన్ మధ్య బాగానే రొమాన్స్ పండించారు. కేతిక శర్మ తన అందాలను ఆరబోసేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు. క్లైమాక్స్ కూడా ఈ సినిమాకు బాగానే కలిసివచ్చింది. ప్రేమ కథలో తెరవెనుక మాఫియా, పోలీస్ క్రైమ్ జోడించడం కలిసి వచ్చే అంశం. ఆకాశ్ పూరి నటనాపరంగా చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఓవరాల్‌‌గా రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పవచ్చు.. ఈ సినిమాకు “న్యూస్ ఆర్బిట్” ఇస్తున్న రివ్యూ 3/5.


Share

Related posts

ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Teja

డేంజ‌ర్ః బ్రిట‌న్లో వ‌చ్చిన క‌రోనా గురించి కాదు… మ‌న బ‌తుకు గురించి ఆలోచించుకోండి

sridhar

హస్తినకు తెలుగు రాష్ట్రాల సీఎంలు క్యూ..! ఎందుకోసమో..!?

somaraju sharma