డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సినిమా కి ఒక లెక్క ఉంటుంది. హీరో ఇలానే ఉండాలని రూల్ ఉండదు.. ఇది ఒక లెక్కే.. సినిమా కోసం ఇన్ని కోట్లు ఖచ్చితంగా పెట్టాలి అన్న రూల్ ఉండదు.. ఇది కూడా ఒక లెక్కే.. వారం రోజుల్లో సీన్స్.. వారం రోజుల్లో డైలాగ్స్ రాసేస్తాడు … అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టడు .. ఇది కూడా పూరి చెప్పే లెక్కే. అంతేకాదు హీరో ఎంతటి స్టార్ అయినా 3-4 నెలలలోపే థియోటర్స్ లో బొమ్మ పడుతుంది. ఇలాంటి లెక్కలు మరే డైరెక్టర్ కి ఉండవు.
ఇక బడ్జెట్ విషయంలో కూడా ఇప్పటి వరకు ఈ రేంజ్ భారీ బడ్జెట్ పెట్టి పూరి సినిమా తీశాడన్న మాట ఇప్పటి వరకు వినిపించలేదు. అంతేకాదు ఇప్పుడు పూరి పాన్ ఇండియన్ సినిమా లెక్క మార్చబోతున్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాల బడ్జెట్ చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. బాహుబలి సినిమా కంటే ముందు మన తెలుగు సినిమా బడ్జెట్ 50 నుంచి 70 కోట్ల లోపే ఉందేది అని అనేవారు.
కాని బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత 70 కోట్ల బడ్జెట్ సినిమా అన్న మాట వినిపించడం లేదు. ముఖ్యంగా డార్లింగ్ ప్రభాస్ సినిమా అంటే కనీసం 300 కోట్ల కి మించి ఉంటోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాల బడ్జెట్ లెక్క ఇదే. వీటిలో ఆది పురుష్ సినిమాకి కేటాయించిన బడ్జెట్ 700 కోట్లు అంటున్నారు.
కాని పాన్ ఇండియన్ సినిమా అంటే పూరి జగన్నాధ్ లెక్క వేరే ఉంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ అన్న వర్కింగ్ టైటిల్ తో ఒక పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కిస్తున్నారు. పూరి కనెక్ట్స్, పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ పతాకాలపై ఈ సినిమా నిర్మిస్తుండగా బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా నాలుగు ప్రధాన భాషల్లో రూపొందుతుండగా పూరి ఈ సినిమాకి 70 కోట్ల లోపే బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తుంది. అంటే పూరి పాన్ ఇండియన్ సినిమా బడ్జెట్ 70 కోట్లని అర్థమవుతుంది. ఇదే బడ్జెట్ తో గనక పూరి పాన్ ఇండియన్ సినిమా తీసి సక్సస్ ఇస్తే దర్శక ధీరుడు రాజమౌళి లాంటి వాళ్ళు కూడా ఇకపై బడ్జెట్ విషయంలో దిగి రావాల్సిందే అంటున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!