పూరి జగన్నాధ్ కి పెద్దగా కథ అవసరం లేదు. చిన్న పాయింట్ దొరికితే దాన్ని కథ గా అల్లేస్తాడు. పాయింట్ చిన్నదైనా అన్నీ ఎమోషన్స్ పుష్కలంగా ఉంటాయి. కథ రాయడానికి వారం.. డైలాగ్స్ రాయడానికి వారం. మొత్తంగా పూరి జగన్నాధ్ కంప్లీట్ గా స్క్రిప్ట్ రెడీ కావడానికి పట్టే సమయం 15 రోజులు మాత్రమే. ఇండస్ట్రీలో ఇంత త్వరగా కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేసేది బహుషా ఒక్క పూరి జగన్నాధ్ మాత్రమే. కొంత మంది రచయితలు.. దర్శకులు ఒక కథ కోసం ఏళ్ళు తరబడి వర్షన్స్ రాస్తూనే ఉంటారు.
కథ రాయడానికి నెలలు నెలలు సమయం తీసుకుంటారు. ఒక్కోసారి రెండు మూడు ఏళ్ళు కథ మీద వర్క్ చేసి కూడా పక్కన పెట్టిన వాళ్ళు లేకపోలేదు. ఇక ఒకేసారి రెండు కథలతో సినిమాలు తెరకెక్కి సూపర్ హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకు ఉదాహరణ పూరి జగన్నాధ్ .. ఎన్.టి.ఆర్ తో తీసిన టెంపర్.. అనిల్ రావిపూడి .. కళ్యాణ్ రాం తో తీసిన పటాస్. ఈ రెండు కథలు దాదాపు ఒక్కటే. కాని కథనం వేరేలా ఉంటుంది. ఇదే మాట పూరి జగన్నాధ్ తో కళ్యాణ్ రాం అంటే.. పూరి జగన్నాధ్ చెప్పిన మాట ఒక్కటే .. అన్నీ కథలు ఒక్కటే.
తీయడంలోనే ఎవరి స్టైల్ వారికి ఉంటుంది. అలాగే అటు టెంపర్ .. ఇటు పటాస్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు కూడా పూరి – విజయ్ దేవర కొండ కాంబినేషన్ లో వస్తున్న లైగర్ అలాగే వరుణ్ తేజ్ నటిస్తున్న గని ఒకే జోనర్ లో తెరకెక్కుతున్నాయి. కాని కథనం వేరేలా ఉంటుందట. ‘గని’ సినిమాలో క్రీడాకారులపై చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపనున్నారని… ఒలింపిక్ పతకాలు సాధించిన వారిలో అందరు క్రీడాకారులు తగిన గుర్తింపును పొందలేకపోతున్నారు…ఈ పాయింట్ నే బేస్ చేసుకొని తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇక పూరి – విజయ్ ల ‘లైగర్’ రివేంజ్ డ్రామా అని సమాచారం. చూడాలి మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి రిజల్ట్ ని తీసుకు వస్తాయో.