ప్రపంచంలో ఎలాంటి విషయం గురించి అయినా చదువుకున్న వ్యక్తి నుంచి మట్టిబుర్ర వరకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో తనదైన శైలిలో చెబుతుంటాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. తన సినిమాలలో కూడా అప్పుడప్పుడు జీవిత సత్యాలు గురించి తెలియజేస్తూ ఉంటాడు. అటువంటి పూరి జగన్నాథ్ ఇటీవల “పూరి ముజింగ్స్” అంటూ తన ఆలోచనలు, సూచనలు సమాజంపై అన్ని విషయాల గురించి వివరిస్తూ మాట్లాడుతున్నారు.
ప్రపంచంలో ఎలాంటి విషయం అయినా సెక్స్, భయం, శత్రువు ఇలా అనేక విషయాల గురించి తన భావాలను వ్యక్త పరుస్తూ ఉంటారు. అయితే అడపాదడపా కాకుండా “ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను” అన్నట్టుగా చాలా డెడికేషన్ గా ఆడియోలు అందిస్తున్నారు. “పూరి ముజింగ్స్” అంటూ పూరి అందిస్తున్న వాయిస్ లకు నెటిజన్ల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.
వీటికి చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు. ఒక యుద్ధం లాగా డాషింగ్ డైరెక్టర్ పూరి తన ఫాలోవర్స్ కి అనేక విషయాలపై పట్టు ఉండేలా వెరైటీ టాపిక్ తో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఆడియో క్లిప్స్ అన్ని 4, 3 నిమిషాల అయినా గాని…… పూరి స్టైల్ లో చెప్పడంతో ఆసక్తిగా ఉన్నాయి. ఓటమి నుండి బయటికి ఎలా రావాలి, ఒంటరి తనం నుండి పరిస్థితులను ఎలా జీవించాలి…. సెల్ఫ్ మోటివేషన్ తరహాలో పూరి చెబుతున్న మాటలు చాలా ప్రభావితంగా ఉన్నాయి.