టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ విజయాలు తీసే డైరెక్టర్ లలో ఎక్కువగా వినబడే ఇద్దరి పేర్లు రాజమౌళి, పూరి జగన్నాథ్. ఇద్దరు తీసే సినిమాలకి బయట మంచి మార్కెట్ ఉంది. వీరిద్దరిలో రాజమౌళికి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా పడలేదు. కానీ పూరి జగన్నాథ్ మొన్నటి వరకు ఫుల్ డిజాస్టర్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా సినిమాలు తీయడంలో మాత్రం పూరి జగన్నాథ్ అతి తక్కువ సమయంలోనే తీసి ఇండస్ట్రీ హిట్ అందుకున్న రోజులు ఉన్నాయి. రాజమౌళి సంవత్సరాలు సంవత్సరాలు పాటు సినిమాలు చేసి విజయాలు సాధిస్తూ ఉంటారు.
ఈ క్రమంలో ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో చేస్తున్న ఫైటర్ సినిమా కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా టైం తీసుకుంటున్న నేపథ్యంలో పూరి జగన్నాథ్ పై సినిమా ప్రేక్షకులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఉన్న కొద్ది పూరి జగన్నాథ్ రాజమౌళి లాగా మారిపోతున్నాడు అని అంటున్నారు. ఫైటర్ సినిమాకి సంబంధించి ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వకపోవడం దారుణమని పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా పూరి జగన్నాథ్ ఈ సినిమా తన కెరీర్ లోనే చాలా స్పెషాలిటీ ఉన్న సినిమా అని గతంలో ప్రకటించడం జరిగింది. సినిమాలో హీరోగా నటిస్తున్న విజయ్ దేవరకొండ… కచ్చితంగా ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి రావాలని కృషి చేస్తున్నారు. విజయ్ దేవరకొండ పక్కన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది.