“అర్జున్ రెడ్డి” సినిమా తో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత “గీతా గోవిందం” సినిమా తో మరో విజయాన్ని అందుకుని అమ్మాయిల ఫాలోయింగ్ పెంచుకున్నాడు. కానీ ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడటంతో మనోడి గ్రాఫ్ అమాంతం తగ్గిపోయింది.
ఈ ఏడాది ప్రారంభంలో “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమాతో దాదాపు నలుగురు హీరోయిన్లతో సరికొత్త ప్రయోగం చేసిన వర్కౌట్ కాలేదు. అయితే తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “ఫైటర్” సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడగా తాజాగా మళ్లీ సెట్స్ పైకి వెళుతోంది.ఫైటర్ కథ నచ్చడంతో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా మారాడు.
రాబోయే సినిమాలో ఓ అండర్ గ్రౌండ్ డాన్ హౌస్ సెట్ కోసం భారీ స్థాయిలో నిర్మాతలు ఖర్చు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ రెండవ వారం నుంచి ఈ సెట్ లో షూటింగ్ జరుగనున్నట్లు సమాచారం. ఓ డాన్ కొడుకు పాత్రలో విజయ్ దేవరకొండ నటించనున్నారని ఫిలిం నగర్ టాక్. ఇదిలా ఉండగా డైరెక్టర్ పూరిజగన్నాథ్ తన కెరియర్ లోనే ఫైటర్ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుందని స్టేట్మెంట్ ఇవ్వడంతో… సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!