వరస ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ 2019 వ సంవత్సరంలో జూలై 18 వ తారీకు “ఇస్మార్ట్ శంకర్” తో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయంతో పూరి జగన్నాథ్ మళ్లీ హిట్ ట్రాక్ లో పడ్డాడు. ఇదిలా ఉంటే నెక్స్ట్ సినిమా విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా లెవెల్ లో పూరి జగన్నాథ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఒక పక్క డైరెక్షన్ చేస్తూ మరో పక్క నిర్మాతగా వ్యవహరిస్తూ.. ఈ సినిమా ప్రాజెక్టు తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ప్రచారంలో ఫైటర్ అని ఉన్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా ఈ ఫైటర్ అనే టైటిల్ ని బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ తన అప్కమింగ్ సినిమాకి పెట్టడంతో డైలమాలో పడ్డారు పూరి జగన్నాథ్ రేపు ఉదయం పదిగంటల ఎనిమిది నిమిషాలకు విజయ్ దేవరకొండ తో చేయబోయే సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ప్రకటన చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.
ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో లవర్ బాయ్ అదే విధంగా ఫ్యామిలీ కుర్రాడిగా రొమాంటిక్ తరహాలో విజయ్ దేవరకొండ ని పూరి జగన్నాథ్ చూపించ నున్నట్లు సమాచారం. వరుస ప్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెట్టుకున్నారు.