NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

పూరీ- విజయ్ దేవరకొండ మూవీ టైటిల్ అదుర్స్..!!

Share

వరస ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ “ఇస్మార్ట్ శంకర్” సినిమా తో 2019లో హిట్ ట్రాక్ ఎక్కిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సినిమాని విజయ్ దేవరకొండ తో ప్రకటించి సినిమాకి సంబంధించి ఎటువంటి టైటిల్ గాని చెప్పలేదు. కానీ పాన్ ఇండియా తరహాలో ఈ ప్రాజెక్టు తెరకెక్కించడం తో ఈ ప్రాజెక్టు పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

Ananya Panday And Vijay Devarakonda Introduce 'Liger', a Combination of  Tiger And Lion | India.comఅంతేకాకుండా నా కెరియర్ లోనే ఇది బెస్ట్ సినిమా అని పూరి స్టేట్మెంట్ ఇవ్వడం అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ రిలీజ్ చేశారు సినిమా యూనిట్. లైగర్ అనే సరికొత్త టైటిల్తో కింద క్యాప్షన్ క్రోస్ బ్రీడ్ అని పెట్టడంతో .. పూరి తన మార్క్ ఏంటో చూపించాడు.

 

పులికి సింహానికి పుట్టినట్టు వర్నిస్తున్నట్టు విజయ్ దేవరకొండ ని టైటిల్ లో ఒక బాక్సర్ గా చూపించాడు. విజయ్ దేవరకొండ స్టీల్ చూసిన ప్రతి ఒక్కరు అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి తరహాలో ఈ సినిమాని పూరి తెరకెక్కించాడు ఏమో అని కామెంట్లు పెడుతున్నారు. చాలా డిఫరెంట్ టైటిల్ కావటంతో పాటు విజయ్ దేవరకొండ చాలా కొత్తగా కనబడటంతో లైగర్ ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


Share

Related posts

టీటీడీలో మరో వివాదం…ఏమిటంటే..?

somaraju sharma

Kapata Nataka Suthradhari: కపటనాటక సూత్రధారి ట్రైలర్ ను విడుదల చేసిన అశ్వినీదత్..!!

bharani jella

Ram sethu : ‘రామ్ సేతు’లో అదరగొడుతున్న అక్షయ్ కుమార్ లుక్..!

GRK