న్యూస్

గుంటూరు “లైగర్” ప్రీ రిలీజ్ వేడుకలో పూరి వైరల్ కామెంట్స్..!!

Share

శనివారం “లైగర్” ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో ఓ కాలేజ్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వేడుకకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పాటు హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే.. చార్మి “లైగర్” టీం హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు. కార్యక్రమానికి వచ్చిన వాళ్లను ఉద్దేశించి… మిమ్మల్ని చూస్తే సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు వచ్చినట్టు లేదు… సినిమా సక్సెస్ కార్యక్రమానికి వచ్చినట్టు ఉంది అని అన్నారు.

Puri Viral Comments at Guntur Liger Pre Release Ceremony

ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక్కో టికెట్ కొంటే చాలు “లైగర్” బ్లాక్ బస్టర్ యే. విజయ్ దేవరకొండ కి అబ్బాయిలు కంటే అమ్మాయిలు ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నట్లు.. మిమ్మల్ని చూస్తే తెలుస్తోంది. సినిమాలో విజయ్ దేవరకొండ ఇరగదీశాడు. ఇంకా అనన్య పాండే, రమ్యకృష్ణ కూడా ఇద్దరూ బాగా చేశారు. ఈ సినిమాలో హైలెట్ మైక్ టైసన్ హైలైట్. ఆయన కొట్టే మొనగాడు ప్రపంచంలో ఎవరూ లేరు. ఆయన్ని కొడితే…. పైన ప్రపంచంలో కొట్టడానికి ఇంకెవరూ ఉండరు. అటువంటి లెజెండ్ గురించి ముంబై మీడియాలో ఒక జర్నలిస్ట్.. మైక్ టైసన్ అంటే ఎవరు అని నన్ను ఎదురు ప్రశ్నించారు. నేను దానికి చాలా హార్ట్ అయ్యాను.

Puri Viral Comments at Guntur Liger Pre Release Ceremony

దయచేసి సినిమా చూడకముందు గూగుల్ లో మైక్ టైసన్ గురించి కొంచెం తెలుసుకోండి. ఆయన గొప్పతనం గురించి తెలుసుకుని సినిమా చూస్తే.. సినిమాలో ఆయన వచ్చే సన్నివేశాలను బాగా ఎంజాయ్ చేస్తారు. “లైగర్” ప్రేమతో తీసిన సినిమా. ఈ సినిమా విజయం పట్ల ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నామంటే.. నెక్స్ట్ విజయంతో చేస్తున్న జనగణమన దీని కంటే డబల్ బడ్జెట్ సినిమా. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది.. అంటూ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు.


Share

Related posts

MP RRR letter to CM YS Jagan: రఘురామ లేఖాస్త్రాలు ఇంకా ఎన్ని ఉన్నాయో..? వరుసగా మూడో రోజు సీఎం జగన్ కు లేఖ..!!

somaraju sharma

కారు అదిరే తీరు..! టాటా నుండి కొత్త మోడల్ కారు, వివరాలివే..!

bharani jella

Rahul Gandhi: ఆ విషయంలో మెత్తబడిన రాహుల్ గాంధీ..!!

somaraju sharma