Pushpa 2: భారత దేశ వ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో అల్లు అర్జున్ మూవీ ‘పుష్ప 2’ ఒకటని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఈ సినిమా మొదటి భాగం చూశాక రెండో భాగం త్వరగా చూడాలని ప్రేక్షకులు కుతూహల పడుతున్నారు. అయితే దర్శకుడు సుకుమార్ ఈ సినిమాని ఇంకా సెట్స్‌పైకి తీసుకెళ్లలేదు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీలోని ఒక మెయిన్ క్యారెక్టర్ లుక్ లీక్ అయింది. ఆ క్యారెక్టర్ మరేదో కాదు పుష్ప మూవీ మొదలు చివరి వరకు ఉండే కేశవ రోల్. ఈ క్యారెక్టర్ లుక్ ఫస్ట్ పాటలు చాలా నార్మల్‌గా ఉంటుంది. అల్లు అర్జున్ కి రైట్ హ్యాండ్‌గా ఉండే ఈ రోల్లో జగదీష్ ప్రతాప్ బండారి చేసాడు. ఈ యాక్టర్ కాస్త అమాయకంగా కూడా కనిపిస్తూ.. మచ్చా.. మచ్చా.. అంటూ అల్లు అర్జున్‌తో కలిసి నవ్వులు పూయించాడు.
Pushpa 2: విలన్‌గా చూపిస్తారా
అలాంటి ఈ క్యారెక్టర్ సెకండ్ పార్ట్‌లో పూర్తిగా చేంజ్ అయ్యే అవకాశం ఉందని లీకైన ఫొటో ప్రకారం తెలుస్తోంది. ఈ లీక్డ్ ఫొటో చూసి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏంటీ ఇది ట్విస్టా? అయ్యా సుకుమార్ అమాయకుడిని విలన్‌గా చూపిస్తావా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటో ఇంకా పరిశీలనగా చూస్తే పార్ట్-1లో లీడర్‌గా ఎదిగిన తర్వాత అల్లు అర్జున్ ఎలా ఉంటాడో అలా కేశవ గెటప్ కనిపిస్తోంది. ఈ మచ్చా యాక్టర్ సీరియస్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కనిపించాడు. దాంతో పుష్ప కన్‌క్లూజన్‌లో కేశవ కొంపదీసి పుష్పరాజ్‌ను మోసం చేస్తాడా, లీడర్‌గా ఎదగాలనే అధికార దాహం పెరిగిపోతుందా? అసలు ఏం జరుగుతుంది? అని పలు ఊహాగానాలు కూడా అభిమానులు చేస్తున్నారు.
కేశవ నటన ది బెస్ట్
‘పుష్ప’ సినిమాలో బన్నీకి నటనకు ఫుల్ మార్క్స్ పడ్డాయి. అతని పక్కనే ఎప్పుడూ ఉండే జగదీష్ కూడా తన నటనతో అందర్నీ ఇంప్రెస్ చేశాడు. ఈ ఒక్క సినిమాతో అతడు దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌కి బాగా కనెక్ట్ అయ్యాడు.