23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
న్యూస్ సినిమా

Pushpa 2: పుష్ప-2 నుంచి కీలక అప్‌డేట్.. ఆ విషయంలో సుకుమార్ మరింత జాగ్రత్త..

Share

Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 1 సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్ అయింది. దాంతో పుష్ప 2 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందుకే సుకుమార్ పుష్ప-2పై మరింత ఎక్కువ దృష్టి పెట్టారు. ఫస్ట్ అనుకున్న స్క్రిప్ట్‌కి కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు చాలా సమయం తీసుకుంటున్నారు. ఈ విషయంలో బన్నీ కూడా సుకుమార్‌కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. సినిమా పూర్తి చేయడానికి సమయం తీసుకున్న పర్లేదు కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా కథ, స్క్రీన్ ప్లే ఉండాలని సూచించాడు. కథంతా ఓకే అయిన తర్వాత పుష్ప 2 షూటింగ్‌ని ఈమధ్యే సుకుమార్ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ వేగవంతంగా జరుగుతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి 2 షెడ్యూల్స్ హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. కాస్త గ్యాప్‌తో ఆ షెడ్యూల్స్‌ ఫినిష్ చేస్తారు.

Pushpa 2: ఆ విషయంలో సూపర్ కేర్

Pushpa 2
Pushpa 2

ఇక ఈ సినిమాలో అత్యంత కీలకమైన సన్నివేశాల కోసం ఓ షెడ్యూల్‌ను బ్యాంకాక్‌లో పూర్తి చేయనున్నారు. ఆ షెడ్యూల్ రెండు నెలల పాటు జరుగుతుందని సమాచారం. ఈ రెండు నెలలు ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తారు. అయితే కొంతవరకు మారేడుమిల్లి అడవుల్లో షూట్ చేసి దానికి బ్యాంకాక్ షెడ్యూల్ అవుట్ ఫిట్ మ్యాచ్ చేస్తారని టాక్. దానిబట్టి బ్యాంకాక్ అడవులలో షూటింగ్ జరిగినా.. కథ ప్రకారం ప్రతి సన్నివేశం ఇండియాలో జరిగినట్టే ఉండాలి. ఇండియాలో సినిమా మొత్తం జరిగినట్లే చూపించడం కాస్త కస్టమైన పనే! అందువల్ల ఈ విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

విశేషాలు

Pushpa 2
Pushpa 2

ప్రస్తుతం పుష్ప 2 కాస్ట్ అండ్ క్రూ సినిమా షూటింగ్ శరవేగంగా జరిపేందుకు సిద్ధమయ్యారు. ఇక ఫైనల్‌గా సినిమా షూటింగ్ గురించి అఫీషియల్ ప్రకటన ఇవ్వాల్సిన పని ఒకటే మిగిలి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో భన్వర్ సింగ్ షాకావత్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ నటిస్తుండగా, శ్రీవల్లిగా రష్మిక, మంగళం శ్రీనుగా సునీల్, దాక్షాయణిగా అనసూయ నటిస్తున్నారు.


Share

Related posts

కేశినేని రూటే వేరు!

somaraju sharma

Parents: ఈ రూల్ దేశవ్యాప్తంగా అమలు చేస్తే సగం వృద్ధాశ్రమాలు ఖాళీ అయిపోతాయి

Naina

YS Jagan: మధ్యతరగతి ప్రజల కోసం జగన్ ప్రభుత్వం సరికొత్త ప్లాన్..!!

sekhar