Pushpa-2: సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన సినిమా పుష్ప గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయింది. దాదాపు పుష్ప సినిమా వచ్చి 10 నెలలు పూర్తికాబోతుంది.అయినా కూడా పుష్ప 2 సినిమా షూటింగ్ ఇంకా మొదలు పెట్టలేదు. సినిమా తీయడానికి సుకుమార్ దాదాపు ఏడాదిన్నర నుంచి రెండేళ్లు వరకూ సమయం తీసుకుంటారు. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప 2పై ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టాడేమో సుకుమార్. అందుకే ఈ సినిమా చాలా నత్తనడక నడుస్తోందేమో! ఈ నేపథ్యంలోనే “అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది పుష్ప 2 విడుదల చేస్తాం” అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.
Pushpa-2: అతడి మాటల వెనక ఆంతర్యం ఏంటి
నార్త్ సైడ్ న్యూస్ మీడియా CNN News18 నిన్న అల్లు అర్జున్‌కి “ఇండియన్ అఫ్ ది ఇయర్” అవార్డ్‌తో సత్కరించింది. ఆ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ “పుష్ప 2 సినిమాని 2023లో విడుదల చేయాలని ఆశగా ఉంది” అని కాస్త డౌట్ ఫుల్ గా చెప్పారు. ఎందుకంటే సుకుమార్ సినిమా ఎప్పుడు కంప్లీట్ చేస్తాడనే దాని గురించి అల్లు అర్జున్ కి కూడా తెలీదు. అందుకే వచ్చే ఏడాది పుష్ప 2 సినిమా రిలీజ్ చేస్తామని కచ్చితం గా చెప్పలేకపోయాడని తెలుస్తోంది.
ప్రోగ్రెస్ ఇది
మూవీ టీమ్ ఈ నెలాఖరులో షూటింగ్ మొదలు పెట్టి వచ్చే ఏడాది డిసెంబరులో పుష్ప 2ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే 2024 సమ్మర్ హాలీడేస్‌లో ఈ సినిమాని విడుదల చేస్తారు. పుష్ప 2 కోసం అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక చాలా ఎక్కువగా పారితోషికం తీసుకుంటున్నారు. సుకుమార్ ప్రాఫిట్స్‌లో కొంత భాగం ఇవ్వాలని ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్టు సమాచారం. ఇక అల్లు అర్జున్ రూ.125 కోట్లు తీసుకుంటున్నాడని ఇటీవల కొన్ని రిపోర్ట్స్ పేర్కొన్నాయి.