Pushpa : అల్లు అర్జున్ ‘పుష్ప’ డైలాగ్ లీక్…?

Share

Pushpa : అల్లు అర్జున్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని చిత్తూర్ అడవుల్లో షూటింగ్ చేశారు.

 

ఆగస్టులో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ‘ప్రిల్యూడ్’ ను చిత్ర బృందం విడుదల చేసింది. దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ సౌండ్, మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం టీజర్ ఏప్రిల్ 7వ తేదీన అల్లు అర్జున్ పుట్టిన రోజు స్పెషల్ గా విడుదల కానుంది. 

ఇక ఇందులో ఒక డైలాగ్ బాగా పాపులర్ అవుతుందని అంటున్నారు. అలాగే సినిమాలో కూడా ఈ డైలాగ్ పదేపదే అల్లు అర్జున్ వాడుతాడట. ఇటీవల ‘చావు కబురు చల్లగా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ ని ‘పుష్ప’ గురించి ఒక మాట చెప్పమంటే ‘తగ్గేదే…లే’ అని అన్నాడు. 

ఇప్పుడు టీజర్లో కూడా ఈ డైలాగ్ ఉంటుందని అంటున్నారు. చిత్తూరు యాస లో బన్నీ ఇలాంటి డైలాగులు చెబితే అదిరిపోతుందని స్టైలిష్ స్టార్ అభిమానులు అంటున్నారు.


Share

Related posts

బిగ్ బాస్ 4: గ్రాండ్ ఫినాలే కి చీఫ్ గెస్ట్ ఫిక్స్..??

sekhar

వకీల్ సాబ్ టీజర్ రెడీ..ఫ్యాన్స్ బీ రెడీ ..?

GRK

Vakeel Saab Teaser : ‘క్లాస్ గా ఉండే మాస్ వకీల్ సాబ్’ పవర్ స్టార్

arun kanna