Samantha : విడాకుల అనంతరం సమంత పని అయిపోయిందని ఓ వర్గం వారు అనుకున్నారు. కానీ నేడు సామ్ కెరీర్ ని చూసి అలా అనుకున్నవారే శెభాష్ అని అంటున్నారు. అంతలా సామ్ దూసుకుపోతోంది. అవును.. దాంతో అమ్మడు ఏ విషయంలోనూ తగ్గట్లేదు. ఇటీవల కాలంలో సినిమా కధల ఎంపికలో సామ్ వెరైటీ కాన్సెప్ట్స్ ఎంచుకుని.. నటిగా తన స్థానాన్ని పదిలం చేసుకొనే పనిలో పడింది. దానికి తోడు ఇటీవల ‘పుష్ప’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి, అంతకు ముందు ఏ స్పెషల్ సాంగ్కీ ఎవరూ తీసుకోనంత రెమ్యునరేషన్ అందుకుంది సమంత.
Samantha : సామ్ డిమాండ్ ఇదే:
తాజాగా సమాచారం ప్రకారం, సమంత రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకి 4 కోట్లు పైనే తీసుకుంటుందని వినికిడి. తాజాగా విజయ్ దేవరకొండతో ఓ సినిమా ఈమె కమిటైయింది. శివ నిర్వాణ ఈ చిత్రాన్ని భారీస్థాయిలో రూపొందించనున్నాడు. ఈ సినిమా కోసం సమంత ఏకంగా 4 కోట్ల పైనే రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. మొదట షాక్ తిన్న నిర్మాతలు, మన సామ్ ఫామ్ లో వున్న కారణంగా ఆ మొత్తం ఇవ్వడానికి చచ్చేటట్టు ఒప్పుకున్నారట.
సమంత తాజా ప్రాజెక్ట్స్ ఇవే:
సాధారణంగా 3 కోట్లు అంటేనే చాలా ఎక్కువ అలాంటిది 4 కోట్లు అంటే షాకింగే మరి. సమంతకి వున్న డిమాండ్ అలాంటిది మరి. ఇకపోతే సామ్ చేసిన ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధంగా వుంది. అలాగే పాన్ ఇండియాలో షూటింగ్ జరుపుకుంటున్న ‘యశోద’ గురించి అందరికీ తెలిసిందే. వీటితో పాటు మరికొన్ని సినిమాలు వున్నాయి. అలాగే ఓ వైపు బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా వుంది సమంత. ఈ క్రమంలో సామ్ దీపం ఉండగానే ఇళ్ళు చక్కెబెట్టుకొనే పనిలో పడింది. అవును.. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే అంటోంది మరి.