Pushpa: తెలుగు సినిమాలను ప్రమోట్ చేస్తున్న వార్నర్.. థాంక్స్ చెప్పిన పుష్ప!

Share

David Warner: ఒకప్పుడిలా లేవు పరిస్థితులు. ‘తెలుగు సినిమా’ అని చెప్పుకొని సిగ్గు పడే స్థాయినుండి ‘తెలుగు సినిమారా ఇది!’ అని గర్వంగా తలెత్తుకొని తిరిగే స్థాయికి చేరుకుంది మన టాలీవుడ్. ఈ ఘనత పూర్తిగా SS రాజమౌళిదే. తెలుగు సినిమా బాహుబలి ముందు, తరువాత అని చెప్పుకుంటున్నామంటే అది ఆయని చలవే. అంతలా ఆ సినిమా విశ్వములో ప్రభావం చూపింది. అలాంటి పరిస్థితుల తరువాతే.. వివిధ రంగాల్లో ప్రముఖులు తెలుగు సినిమాల వైపు చూడటం మొదలు పెట్టారు.

టాలీవుడ్ ని మెచ్చిన వార్నర్:

ఇక ఈ మద్య కాలంలో చూసుకుంటే, అంటే ముఖ్యంగా కరోనా సమయంలో డేవిడ్ వార్నర్ మన తెలుగు సినిమాలలో వివిధ స్టార్స్ ని అనుకరించి డైలాగులు చెప్పడం, డాన్సులు వేయడం చేసారు. దాంతో ఫ్రీగా మన తెలుసు సినిమాలకు ప్రమోషన్ లభించింది. ఇపుడు తాజాగా పుష్ప పాటతో మరోసారి రెచ్చిపోయాడు. దాంతో సినీ ప్రముఖులు కొందరు వార్నర్ ను తెగ మెచ్చేసుకుంటున్నారు. ఈ కోవలోనే టాలీవుడ్ తరపున వెంకీ కుడుముల పుష్ప ప్రీ రిలీజ్ వేదిక నుండి డేవిడ్ వార్నర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది.

వార్నర్ కి థాంక్స్ చెప్పిన పుష్ప!

ఇకపోతే, డేవిడ్ వార్నర్ మొన్నటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడటం మనకు తెలిసినదే. ఎక్కువగా ఆటతోనే బిజీగా ఉంటున్న వార్నర్ ఖాళీ సమయాల్లో తనకిష్టమైన టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ వుంటారు. అలాగే ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో డేవిడ్ వార్నర్ & ఫ్యామిలీ ఓ మెరుపు మెరుస్తూ ప్రేక్షకులకి ఆనందం కలిగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన కన్ను తెలుగు పరిశ్రమ మీద పడింది. అది టాలీవుడ్ కి ప్లస్ అయింది అనడంలో సందేహమే లేదు. అది గుర్తించిన మనవాళ్ళు పుష్ప ప్రీ రిలీజ్ వేదిక నుండి టాలీవుడ్ తరపున ఆయనకి కృతజ్ఞతలు చెప్పారు.


Share

Related posts

మళ్లీ గోదా’వర్రీ’

somaraju sharma

చాకోలేట్ దేవుడు.. చాక్లేట్లంటేనే ఆ దేవుడికి ఇష్టం.. ఇంతకీ ఆయన ఏ దేవుడంటే?

Varun G

Anasuya Bharadwaj Amazing Looks

Gallery Desk